/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-73.jpg)
Vyjayanthi Movies : ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బాధితులకు ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. వారిలో హీరోలతో పాటూ పలువురు నిర్మాతలు కూడా ఉన్నారు. ఇందులో భాగంగానే బాదితులకు సాయంగా ‘కల్కి 2898AD’ మేకర్స్ అయిన వైజయంతీ మూవీస్ రూ.25 లక్షలు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ 25 లక్షలు కేవలం ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు మాత్రమే ఇచ్చారు. తెలంగాణ కు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో సదరు నిర్మాణ సంస్థపై నెట్టింట విమర్శలు వచ్చాయి. నిజానికి 'కల్కి' మూవీకి ఎక్కువ ఆదాయం వచ్చిందే నైజాం నుంచని నెటిజన్స్ ట్రోలింగ్ చేశారు.
Together, let’s make tomorrow better.@TelanganaCMO pic.twitter.com/6QQPfOnsgd
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) September 4, 2024
Also Read : వరద బాధితులకు అండగా అక్కినేని ఫ్యామిలీ.. రూ.కోటి విరాళం
దీంతో వైజయంతీ మూవీస్ సంస్థ తెలంగాణకూ తాజాగా రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. వరద బాధితుల సహాయార్థం రూ.20 లక్షల విరాళాన్ని తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేస్తున్నట్లు తెలుపుతూ..' ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మన ప్రజల కోసం నిలబడటం మన రెస్పాన్సిబిలిటీ' అని పేర్కొంది.