Diabetes Test with Sweat: డయాబెటిస్.. ఎన్నో దశాబ్దాల ముందు దేశాన్ని చుట్టేసిన ఈ వ్యాధి.. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరిని పట్టి పీడిస్తోంది. మధుమేహం అనేది రక్తంలో గ్లూకోజ్ (చక్కెర) అధిక స్థాయిలో ఉండటం వల్ల దాని ప్రభావం శరీరంలోని ఇతర అవయవాలపై దుష్ప్రభావాన్ని చూపుతుంది. ఇది దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితి. ప్యాంక్రియాస్ ద్వారా తగినంత ఇన్సులిన్(Insulin) ఉత్పత్తి చేయకపోవడం లేదా ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌ను శరీరం సమర్థవంతంగా ఉపయోగించలేకపోవడం వల్ల ఇది జరగవచ్చు. ఇన్సులిన్ అనేది శక్తి కోసం కణాలలోకి గ్లూకోజ్‌ను తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెరను నియంత్రించే హార్మోన్. షుగర్ పరీక్షలు, ప్రత్యేకంగా రక్తంలో గ్లూకోజ్ పరీక్షలను సూచిస్తాయి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ టెస్ట్ (FBS), పోస్ట్‌ప్రాండియల్ బ్లడ్ షుగర్ టెస్ట్ (PPBS), రాండమ్ బ్లడ్ షుగర్ టెస్ట్ (RBS), ఓరల్ గ్లూకోస్ టాలరెన్స్ టెస్ట్ (OGTT), HbA1c పరీక్ష ద్వారా షుగర్ టెస్ట్‌లు చేస్తుంటారు. అయితే ఇవి ఖర్చుతో కూడుకున్నవి. అయితే వీటితో సంబంధం లేకుండా కేవలం చెమట(Sweat)తోనే ఇక్‌పై షుగర్ టెస్టు చేసుకోవచ్చు.
షుగర్ టెస్టుకు కొత్త పరికరం:
చెమట ద్వారానే రక్తంలో షుగర్ లెవల్స్ కోలిచే ఓ డివైజ్‌ని ఆంధ్రప్రదేశ్‌కు (AP) చెందిన సైంటిస్ట్ కనుగొన్నారు. ఆయన పేరు వూసా చిరంజీవి శ్రీనివాసరావు (Chiranjeevi Srinivasarao Vusa). ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన డాక్టర్ చిరంజీవి నిరుపేద కుటుంబం నుంచి అంచలంచెలుగా ఎదిగారు. వివిధ దేశాల్లో చెమట ద్వారా షుగర్ లెవల్స్ కోలిచే డివైజ్‌ల కోసం పరీక్షలు జరుగుతుండగా.. చిరంజీవికి మాత్రం ఇప్పటికే ఈ పరికరానికి సంబంధించి పేటెంట్ హక్కులు కూడా రావడం విశేషం. ఈ మేరకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 29(2023)న దీనికి సంబంధించి అధికారిక నిర్ణయం వెలువడింది. చిరంజీవి శ్రీనివాస్‌రావు కనిపెట్టిన ఈ పరికరాన్ని కేంద్రం రెండేళ్ల పాటు చాలా విధాలుగా పరీక్షించి చూసింది. చివరకు ఈ డివైజ్‌ను రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కనుగోనేదిగా ఓకే చెప్పింది. దీంతో చిరంజీవి శ్రీనివాస్‌రావు కష్టానికి ప్రతిఫలం దక్కింది.
మధుమేహం ఉన్న రోగులకు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తరచుగా కొలవడం అవసరం. అయితే ఇది చాలా నొప్పితో కూడుకున్న విషయం. చెమటలో గ్లూకోజ్ స్థాయిలను నాన్-ఇన్వాసివ్‌గా కొలవగలదు. మిగిలిన టెస్టులతో పోల్చితే ధర కూడా తక్కువే ఉంటుంది. అంటే పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఎంతోగానే మేలు చేయనుంది.
Also Read: సూది అవసరంలేదు.. చెమటతో షుగర్ టెస్ట్.. తెలుగు శాస్త్రవేత్త ఘనత..!
WATCH: