VRO VRA System TS News: గతేడాది జులైలో వీఆర్ఏ, వీఆర్‌ఓ వ్యవస్థను నాటి కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసందే. నీరటి, మస్కూరు, లష్కర్ లాంటి కాలం చెల్లిన పదజాలంతో సుదీర్ఘకాలం కొనసాగిన వ్యవస్థ భూస్వామ్య గతానికి ప్రతీక అని అందుకే రద్దు చేస్తున్నామని అప్పుడు ప్రకటించారు. అయితే తాజాగా కాంగ్రెస్ రేవంత్ సర్కార్ ఈ వ్యవస్థను మళ్లి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రేవంత్ సర్కార్ ఏం ఆలోచిస్తోంది?
VRO, VRAలను పునరుద్ధరించే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ భూములు కాపాడటంలో VRO వ్యవస్థే కీలకం అంటోంది రేవంత్ సర్కార్. ఇదే అంశాన్ని మరోసారి స్పష్టం చేశారు రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రతిగ్రామంలో ఓ రెవిన్యూ ఉద్యోగి ఉంటారని పొంగులేటి చెప్పుకొచ్చారు .త్వరలోనే విధివిధానాలు ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. VRO, VRA వ్యవస్థను రద్దు చేసిన గత BRS ప్రభుత్వం.. ఇతర శాఖల్లోకి ఆ ఉద్యోగులను సర్దుబాటు చేసింది. ఇతర శాఖాల్లో సర్దుబాటు చేసిన ఈ ఉద్యోగులనే మళ్లీ తీసుకుంటారా? లేదా కొత్తగా నియమిస్తారా అనే అంశంపై సస్పెన్స్ నెలకొంది.
రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్‌ఏలు గతంలో పనిచేసేవారు. వారిలో కొందరు నిరక్షరాస్యులు, 7వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీతో పాటు ఉన్నత చదువులు ఉత్తీర్ణులైన వారు ఉన్నారు. వారి విద్యార్హత ఆధారంగా వారు అర్హులైన ఉద్యోగ వర్గాలను ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధనల ప్రకారం వాటిని ఆయా శాఖల్లో ఉంచింది. ఇక గతంలో కారుణ్య నియామకం కింద 61 ఏళ్లు నిండిన వీఆర్‌ఏల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. జూన్ 2, 2014 తర్వాత సర్వీస్‌లో మరణించిన 61 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న VRA ల వారసులు కూడా ఇలాంటి నియామకాలకు పరిగణించబడ్డారు. మరి వారందరిని మళ్లీ తీసుకుంటారా లేదా అన్నది చూడాల్సి ఉంది.
Also Read: హీరో వెంకటేశ్‌కు నాంపల్లి కోర్టు షాక్.. కేసులు నమోదు!
WATCH: