అయోధ్య రామయ్య కొలువుకు సిద్ధమవుతున్నాడు. వచ్చే నెల 22న జరిగే ప్రాణప్రతిష్ఠకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అందరికీ ఆహ్వానాలు కూడా వెళ్ళాయి. అంగరంగ వైభవంగా ఉత్సవాన్ని జరిపించడానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లను చేస్తోంది. అయితే రామమందిరంలో గర్భాలయంలో ప్రతిష్టించే రాముల వారి విగ్రహానికి ఇవాళ ఓటింగ్ జరగనుంది. దీనికోసం ముగ్గరు శిల్పులు తయారు చేసిన విగ్రహాలను ఎంపిక చేశారు. వాటిల్లోంచి ఒకదానిని సమావేశంలో ఉంచి అత్యధికులు ఓటేసిన విగ్రహాన్ని గర్భాలయంలో ప్రతిష్ఠించనున్నారు.
Also Read:హమాస్ చెరలో అడవిలో జంతువులా ఉన్నాను-మియా స్కెమ్
ఐదేళ్ళ బాలుడి రూపంలో ఉన్న 51 అంగుళాల పొడవైన మూడు విగ్రహాల్లో దేనిలో అయితే దైవత్వం ఎక్కువ ఉంది అనిపిస్తుందో దాన్నే ఎంపిక చేస్తామని ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు. పట్టాభిషేక మహోత్సవానికి తేదీ దగ్గరపడుతోంది. అందుకే ట్రస్ఠ్ చైర్మన్ నృపేంద్ర మిశ్రా రామజన్మభూమి మార్గం, ఆలయ సముదాయంలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. మొత్తం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి మూడు దశల ప్రణాళికతో నిర్మాణం వేగవంతమే కాకుండా నాణ్యతపై దృష్టి సారిస్తోందని మిశ్రా హామీ ఇచ్చారు.
ఏడు రోజుల పాటు జరిగే రామాలయ పవిత్రోత్సవం జనవరి 16న ప్రాయశ్చిత్త కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. ఈ వేడుకలో ముఖ్యమైన సంఘటనలలో రాముని విగ్రహా ఊరేగింపు, ఆచార స్నానాలు, పూజలు, హోమాలు ఉంటాయి. జనవరి 22న ఉదయం పూజను నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం మృగశిర నక్షత్ర అభిజీత్ లగ్నంలో ప్రాణప్రతిష్ఠను నిర్వహిస్తారు. ప్రధాని మోదీ దీనిని నిర్వహించునున్నారు.