/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Vote-Trends-jpg.webp)
Vote Trends: మీ ఓటు నాకే.. నాకు ఓటు వేయండి.. నన్ను గెలిపించండి.. ఇలా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్ల వెనుక పడటం సహజం. వారు పోటీ చేసే నియోజకవర్గాల్లో చెప్పులరిగేలా తమకు ఓట్లు వేయాలి అని అభ్యర్థిస్తూ తిరుగుతారు. గెలిస్తే ఏమి చేస్తామో చెబుతారు.. అవతలి వారికి ఓటు వేస్తే ఎంత నష్టపోతారో కాస్త గట్టిగానే వివరిస్తారు. ఎన్నికల రోజు మాత్రం కొంతమంది వారి ఓటు వారే వేసుకోలేని పరిస్థితి విచిత్రంగా ఉంటుంది కదూ.. అవును తెలంగాణ ఎన్నికల్లో చాలామంది అభ్యర్థులు తమ ఓటు తామే వేసుకోలేరు. తాము పోటీ చేస్తున్నదగ్గర మంది ఓట్లు తమకు పడతాయి కానీ.. తమ ఓటు మాత్రం వేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే, వీరు తమ నియోజకవర్గాలను వదిలి వేరే నియోజకవర్గాల్లో తమ గెలుపు అదృష్టాన్ని వెతుక్కుంటున్నారు. అందువల్ల వీరు తమ ఓటు తాము వేసుకునే పరిస్థితి లేదు.
ఆ లిస్ట్ ఒకసారి చూద్దాం..
సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఓటు సిద్దిపేట జిల్లా చింతమడకలో ఉంది. ఈయన తన ఓటు అక్కడే వేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డి ది కూడా అదే పరిస్థితి. (Vote Trends)ఈయన కూడా కామారెడ్డి నుంచి పోటీలో ఉన్నారు. ఈయన ఓటేమో కొడంగల్ లో ఉంది. ఈయన తన ఓటు అక్కడే వేస్తారు.
ఇక వీరు కాకుండా.. బాన్సువాడ నియోజకవర్గంలో ప్రధాన ప్రత్యర్దులదీ ఇదే పరిస్థితి. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా యెండల లక్ష్మీనారాయణ పోటీలో ఉన్నారు. ఈయన ఓటేమో నిజామాబాద్ లో ఉంది. అలానే ఇక్కడ కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్న ఏనుగు రవీందర్ రెడ్డి ఓటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్‌లో ఉంది. ఈయన అక్కడే తన ఓటు వేస్తున్నారు.
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎల్లారెడ్డి నుంచి బరిలో ఉన్న మదన్‌మోహన్‌రావుకు అక్కడ ఓటు లేదు. ఈయన ఓటు హైదరాబాద్ లోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉంది. అందువల్ల ఈయన కూడా తన ఓటు తానూ వేసుకోలేడు.
Also Read: ఓటు వేయడానికి తరలివస్తున్న ప్రముఖులు, రాజకీయ నాయకులు
వీరుమాత్రమే కాదు.. చిన్న పార్టీల నుంచి పోటీలో ఉన్నవారు.. కొంతమంది ఇండిపెండెంట్స్ కూడా తమ ఓటు హక్కును తమ కోసం వినియోగించుకోలేని పరిస్థితిలో ఉన్నారు.
ఇలా ఓటు ఒకచోట.. పోటీ మరోచోట ఉన్న అభ్యర్థులు వారి ఖర్మ కాలి.. ఒక్క ఓటుతో ఓడిపోయే పరిస్థితి వస్తే.. ఇది మరీ ఎక్కువగా చెబుతున్నట్టుగా అనిపించవచ్చు కానీ.. జరగకూడదని లేదు కదా. ఏమో ఎన్నికలు అంటే డబ్బు.. పరపతి.. పార్టీ ఇవే కాదు అదృష్టం కూడా. సరే మనం పాజిటివ్ గా ఆలోచించాలి కాబట్టి అలా జరగకూడదని కోరుకుందాం.
Watch this interesting Video: