Vodafone Idea: బకాయిలు చెల్లించండి.. లేకపోతే సర్వీస్‌ ఫసక్‌ అవుతుంది.. వొడాఫోన్ ఐడియాకు వార్నింగ్‌!

వొడాఫోన్ ఐడియా(వీఐ)కి గడ్డుకాలం నడుస్తోంది. ఇండస్ టవర్స్ డబ్బుల చెల్లింపులో వేల కోట్ల బాకీ పడిపోయిన వీఐ తన సర్వీసులను కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. బాకీలు చెల్లించకపోతే వీఐ సర్వీసులను పరిమితం చేస్తామని ఇండస్‌ టవర్స్‌ ట్రాయ్‌కి చెప్పింది. ఇదే జరిగితే వొడాఫోన్‌ ఐడియా యూజర్లు ఎయిర్‌టెల్‌, జియో లేదా ఇతర నెటవర్క్‌లకు షిఫ్ట్ అయ్యే అవకాశాలుంటాయి.

New Update
Vodafone Idea 5G Services : వొడాఫోన్-ఐడియా కస్టమర్లకు గుడ్ న్యూస్..త్వరలోనే భారత్ లో 5జీ సేవలు..!!

మీరు వొడాఫోన్‌ ఐడియా(VI)యూజర్లా? మీ సర్వీసులు నిలిచిపోయే అవకాశం ఉంది. అదేంటి..? మేమేం తప్పు చేశాం..బిల్లు కడుతున్నాం కదా అని ఆలోచిస్తున్నారా? మీరు బిల్లు కడుతున్నారన్నది నిజమే కావొచ్చు. మీరు బిల్లు కట్టకపోతే ఒక నిమిషం కూడా మీ ఫోన్‌ అవుట్‌గోయింగ్‌ నిలిపివేసే నెట్‌వర్కింగ్‌ సంస్థలు తమ పని మాత్రం తాము చేయవు. అంటే బిల్లులు కట్టవు.. బకాయిలు పెట్టేస్తాయి. నష్టాలను కప్పిపుచ్చుకునేందుకు యూజర్లపై అధిక ధరలు బాదే కంపెనీలు చెల్లింపుల విషయంలో మాత్రం పిసినరిగా ఉంటాయని అనేక సందర్భాల్లో తేలింది. మరోసారి అదే ప్రూవ్‌ అయ్యింది.

వొడాఫోన్ ఐడియా సర్వీసులు పరిమితం కానున్నాయా?
పెరుగుతున్న రిసీవబుల్స్ కారణంగా వొడాఫోన్ ఐడియా (VI) సేవలను పరిమితం చేయవచ్చని ఇండస్ టవర్స్ సంస్థ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI)కు తెలిపింది. చెల్లింపు బాధ్యతలను నెరవేర్చడంలో VI ఫెయిల్ అవుతోందని విమర్శించింది. ఉద్దేశపూర్వకంగానే VI ఇలా చేసిందని ఆరోపించింది. సెప్టెంబర్ 30 నాటికి VI ఇండస్ టవర్స్‌కు రూ.7,864.5 కోట్ల రుణంలో ఉంది.

ఇది మొదటిసారి కాదు:
ఇండస్ టవర్స్ తన టవర్లకు ప్రవేశాన్ని నిలిపివేస్తామని VIకి వార్నింగ్‌ ఇవ్వడం ఇది మొదటిసారి కాదు. టవర్ కంపెనీకి నెలవారీ కాంట్రాక్ట్ చెల్లింపు బాధ్యతలను నెరవేర్చలేకపోతున్నామని పేర్కొంటూ వీఐ సెప్టెంబర్ 29న ట్రాయ్‌కు లేఖ రాసింది. అయితే ఈ లెటర్‌ తప్పుదోవ పట్టించే విధంగా ఉందని.. మోసపూరితంగా ఉందని ఇండస్‌ టవర్స్ ఖండించింది. తన ఒప్పంద బాధ్యతలను పాటించకుండా తనను తాను రక్షించుకోవడానికి VI ప్రయత్నిస్తోందని ఇండస్ తెలిపింది. ఇండస్ టవర్స్ ఇక్కడ చట్టపరమైన విధానాన్ని తీసుకొని వీలైనంత త్వరగా VI నుంచి చెల్లింపులు కోరే అవకాశం ఉంది.

వొడాఫోన్ ఐడియాకి సమస్యలు తప్పవా?
ఇండస్‌ అన్నంత పని చేస్త వొడాఫోన్‌ ఐడియాకు తిప్పలు తప్పవు. ఇప్పటికే నెట్‌వర్క్‌ రేసులో వొడాఫోన్‌ ఐడియా వెనక పడి ఉంది. ట్రాయ్ విడుదల చేసిన నెలవారీ సబ్ స్క్రిప్షన్ డేటా ప్రకారం.. జూన్‌లో 1.32 మిలియన్ల యూజర్లను కోల్పోయిన తరువాత వీఐ జూలైలో 1.29 మిలియన్ల యూజర్లను కోల్పోయింది. కంపెనీ ప్రస్తుతం సుమారు 228 మిలియన్ల వినియోగదారులకు మొబైల్ కవరేజీని అందిస్తుంది. ఇండస్ టవర్స్ VI సేవలను నిలిపివేయాలని ఫిక్స్‌ అయితే కంపెనీ తీవ్రంగా ప్రభావితమం అవుతుంది. అప్పుడు వొడాఫోన్‌ ఐడియా యూజర్లు ఎయిర్‌టెల్‌, జియో లేదా ఇతర నెటవర్క్‌లకు షిఫ్ట్ అయ్యే అవకాశాలుంటాయి. ఇది కంపెనీని మరింత ఇబ్బందుల్లోకి నెడుతుంది.

ALSO READ: సెలబ్రిటీలు ఫాలో అయ్యే బ్యూటీ సీక్రెట్స్ ఇవే.. ఒకసారి ట్రై చేసి చూడండి!

Advertisment
తాజా కథనాలు