/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-80-2.jpg)
Dastagiri: వివేకా హత్యకేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరికి బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసులో నిందితుల జాబితా నుంచి దస్తగిరి పేరును సీబీఐ కోర్టు తొలగించించింది. ఈ మేరకు తాను అఫ్రూవర్ గా మారడంతో నిందితుల జాబితా నుంచి పేరును తొలగించి సాక్షిగా పరిగణించాలని న్యాయస్థానంలో దస్తగిరి పిటీషన్ వేశారు. సీబీఐ దాఖలు చేసిన అభియోగ పత్రంలో తనను సాక్షిగా చేర్చిన విషయాన్ని కోర్టుకు వివరించాడు. ఈ క్రమంలో దస్తగిరి వాదనలను పరిగణలోకి తీసుకొని నిందితుల జాబితా నుంచి పేరును న్యాయస్థానం తొలగించింది.