Vivek Venkataswamy: ఈ వీడియో అర్థమేంటి వివేక్..? ప్రధాని మోదీ, బీజేపీపై గడ్డం వంశీ విమర్శలు

మాజీ ఎంపీ, ప్రస్తుత బీజేపీ నేత వివేక్‌ తనయుడు వంశీ సోషల్‌మీడియాలో చేసిన ఓ పోస్ట్ కాక రేపుతోంది. పార్టీ మారే ప్రసక్తే లేదని నిన్ననే కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడిన మాజీ ఎంపీ వివేక్‌ని ఇబ్బంది పెట్టేలా ఆ వీడియో ఉంది. ప్రధాని మోదీ టార్గెట్‌గా వివేక్‌ తనయుడు వంశీ తీవ్ర విమర్శలు చేశారు. ఇక కొన్ని వారాలుగా వివేక్ కమల పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకపోవడం, ప్రస్తుత వీడియోతో ఆయన త్వరలోనే కాంగ్రెస్‌లో చేరతారనే ఊహాగానాలకు బలం చేకూర్చింది.

New Update
Vivek Venkataswamy: ఈ వీడియో అర్థమేంటి వివేక్..? ప్రధాని మోదీ, బీజేపీపై గడ్డం వంశీ విమర్శలు

Ex Mp Vivek Venkataswamy son video: ప్రధాని మోదీ, బీజేపీపై మాజీ ఎంపీ వివేక్‌ తనయుడి విమర్శలు గుప్పించడం సంచలనం రేపుతోంది. ఈ మేరకు ట్విట్టర్‌లో వీడియో పోస్టు చేశారు గడ్డం వంశీ. మూడు నిమిషాల నిడివితో వీడియో పోస్టు చేశారు. మణిపూర్ అల్లర్ల విషయంలో కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు వివేక్ తనయుడు వంశీ. కేంద్రం బాధ్యతరాహిత్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. మణిపూర్‌ అల్లర్లపై మోదీ మౌనం వహించారని కామెంట్‌ చేశారు. లోక్‌సభలో మోదీ స్పీచ్‌ తీవ్రంగా నిరాశపరిచిందంటూ ఫైర్ అయ్యారు. అయితే కాసేపటికే ట్విట్టర్‌ నుంచి వీడియో తొలగించారు వంశీ. రాహుల్‌ ఫ్లయింగ్‌ కిస్‌పై స్పందించిన స్మృతి ఇరానీ.. మణిపూర్‌పై మాత్రం స్పందించలేదని నిలదీశారు.
x
ఇప్పుడేం సమాధానం చెబుతారు?
ప్రస్తుతం బీజేపీ పార్టీలోనే వివేక్‌ వెంకటస్వామి కొనసాగుతున్నారు. వివేక్‌ కాంగ్రెస్‌లో చేరతారంటూ కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే నిన్ననే(ఆగస్టు 29) కాంగ్రెస్‌లో చేరిక అంశాన్ని వివేక్‌ ఖండించారు. కానీ 24 గంటలు కూడా గడవకముందే మోదీని విమర్శిస్తూ వంశీ గడ్డం వీడియో రిలీజ్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి 2019 జనరల్‌ ఎలక్షన్స్‌ సమయంలో బీఆర్‌ఎస్‌ నుంచి టికెట్ ఆశించిన వివేక్‌కి నిరాశ ఎదురైంది. దీంతో ఆయన బీజేపీలో చేరినట్టు చెబుతారు. అప్పటి నుంచి వివిధ పార్టీ కార్యకలాపాలలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు వివేక్‌. అయితే కొన్ని వారాలుగా ఆయన కాషాయ పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకపోవడం, త్వరలో కాంగ్రెస్‌లో చేరతారనే ఊహాగానాలకు బలం చేకూర్చింది. ఇదే సమయంలో వివేక్‌ తనయుడు బీజేపీ టార్గెట్‌గా వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడం కాక రేపుతోంది.

కాంగ్రెస్‌లో చేరడంలో డైలమా?
నిజానికి ధర్మపురిలో తన కుమారుడికి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇప్పించాలని వివేక్ తీవ్రంగా లాబీయింగ్ చేసినట్లు ప్రచారం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన వారికే టికెట్‌ కేటాయిస్తారనే నిబంధనతో ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు సందిగ్ధంలో పడ్డారట. వివేక్ 2013లో పార్టీని వీడి టీఆర్‌ఎస్ (ప్రస్తుతం బీఆర్‌ఎస్)లో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. 2014 ఎన్నికల్లో అసెంబ్లీ సీటు నుంచి ఓడిపోయారు. రెండేళ్ల తర్వాత మళ్లీ బీఆర్‌ఎస్‌లో చేరి 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో టిక్కెట్‌ దక్కకపోవడంతో బీజేపీలో చేరారు. నాలుగు రోజుల క్రితం(ఆగస్ట్ 26) మీరు బీజేపీ నుంచి ఎగ్జిట్ అవుతారా అని రిపోర్టర్లు ప్రశ్నించగా.. ఆయన నేరుగా సమాధానం ఇవ్వకుండా, చిరునవ్వుతో వెళ్లిపోయారు. ఇక రాష్ట్రంలోని దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో పార్టీలోని కీలక సభ్యుల్లో వివేక్ ఒకరు.

ALSO READ: కాంగ్రెస్ లో డబుల్ ట్రబుల్..వారసులకు టికెట్ కోసం జోరుగా సీనియర్ల లాబీయింగ్..!!

Advertisment
తాజా కథనాలు