Big Breaking: బీజేపీకి వివేక్ రాజీనామా.. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక!

ఊహించినట్లుగానే బీజేపీకి వివేక్ వెంకటస్వామి షాక్ ఇచ్చారు. కొద్దిసేపటి క్రితం ఆయన పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఆయన తన రాజీనామా లేఖను పంపించారు. అనంతరం రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిపోయారు వివేక్.

New Update
Big Breaking: బీజేపీకి వివేక్ రాజీనామా.. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక!

తెలంగాణలో బీజేపీకి మరో బిగ్ షాక్ తగిలింది. మరో కీలక నేత వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy) కొద్ది సేపటి క్రితం పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి (Kishan Reddy) ఆయన తన రాజీనామా లేఖను పంపించారు. అనంతరం హైదరాబాద్ లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. వివేక్ పార్టీ మారుతారని గత రెండు, మూడు రోజులుగా వార్తలు జోరుగా వస్తున్నాయి. గత శనివారం రాత్రి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వివేక్ ఫామ్ హౌజ్ కు వెళ్లి మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా వివేక్ ను పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. వివేక్ ను చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి దించాలని కాంగ్రెస్ భావిస్తోంది.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్‎తో క్రామేడ్లు కటీఫ్..? ఇదే కారణమంటోన్న సీపీఐ..!!

publive-image

అయితే.. ఆయన మాత్రం ఎంపీగానే పోటీ చేస్తానని స్పష్టం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడిని చెన్నూరు నుంచి పోటీకి దించాలని కాంగ్రెస్‌ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఆఖరి లిస్ట్ తర్వాత ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే.. రాజగోపాల్ రెడ్డితో పాటే వివేక్ కూడా బీజేని వీడుతారని వార్తలు వచ్చాయి. కానీ ఆ సమయంలో రాజగోపాల్ రెడ్డి ఒక్కరే కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు.

దీంతో వివేక్ బీజేపీలోనే కొనసాగుతారని అంతా భావించారు. కానీ గత రెండు, మూడు రోజులుగా వివేక్ పార్టీ మార్పుపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ వార్తలను ఆయన ఖండించకపోవడంతో.. ఈ సారి పార్టీ మార్పు ఖాయమని అంతా భావించారు. ఆ వార్తలను నిజం చేస్తూ వివేక్ ఈ రోజు పార్టీకి రాజీనామా చేశారు.

కాంగ్రెస్ లో చేరిన తర్వాత వివేక్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ రాక్షస పాలన దించేందుకే తాను పార్టీ మారానన్నారు. తెలంగాణ వచ్చినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. తనకు టికెట్ ముఖ్యం కాదని స్పష్టం చేశారు,

Advertisment
తాజా కథనాలు