AP: వివేకానంద రెడ్డి హత్య కేసు.. వైఎస్ షర్మిలపై హైకోర్టులో వ్యాజ్యం!!

వివాకానంద రెడ్డి హత్య కేసును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారంటూ వైయస్ సునీత, వైఎస్ షర్మిలపై హత్య కేసు అప్రూవర్ దస్తగిరి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. వీరిపై తక్షణమే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయంగా తనకు ఇబ్బంది కలిగిస్తున్నారని వాపోయారు.

AP: వివేకానంద రెడ్డి హత్య కేసు.. వైఎస్ షర్మిలపై హైకోర్టులో వ్యాజ్యం!!
New Update

Viveka murder case: తెలుగుదేశం పార్టీకి చెందిన వైయస్ సునీత, వైఎస్ షర్మిలపై హైకోర్టులో వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అప్రూవర్ దస్తగిరి వ్యాజ్యం దాఖలు చేశారు. వైయస్ షర్మిల, బీటెక్ రవి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ సునీత పదేపదే వైయస్ వివాకానంద రెడ్డి హత్య కేసును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారంటూ దస్తగిరి పిటిషన్ లో పేర్కొన్నారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న ఇలాంటి తరుణంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం ఎలక్షన్ నిబంధనలకు విరుద్ధమని గుర్తు చేశారు.

ఏబీఎన్, టీవీ5, ఈ-టీవీ లను ప్రతివాదులుగా..
అలాగు ఈ వార్తలను పదేపదే ప్రచారం చేస్తున్న ఏబీఎన్, టీవీ5, ఈ-టీవీ లను కూడా ప్రతివాదులుగా చేర్చారు. వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కడపలో చేసిన ప్రసంగంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఎలక్షన్ నిబంధనలో స్పష్టంగా వ్యక్తిగతమైన అంశాలు ప్రస్తావించకూడదని ఉన్నప్పటికీ వైయస్ సునీత, వైయస్ షర్మిల తెలుగుదేశం పార్టీ ప్రోత్సాహంతో ఈ కేసుని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారన్నారు. వీరిపై తక్షణమే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చిన రిపోర్టులో స్పష్టంగా కోరారు. పులివెందుల నుంచి పోటి చేస్తున్న తనకు రాజకీయంగా ఈ హత్య కేసు తీవ్ర ఇబ్బందిగా మారబోతుందని తెలిపారు.

ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశంతో..
రాజకీయంగా తనకు ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశంతో ఒక రాజకీయ పార్టీ అండదండలతో ఇలాంటి ఆరోపణలు చేయటం ఎలక్షన్ కమిషన్ రూల్స్ కి వ్యతిరేకమని గుర్తు చేశారు దస్తగిరి. అంతేకాదు తక్షణమే వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి ఎటువంటి రాజకీయ ప్రసంగాలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఎలక్షన్ ముగిసే వరకు ఈ కేసుపై ఎటువంటి మీడియా కథనాలు కూడా ప్రచురించవద్దని, మీడియాకు కూడా ఆదేశాల ఇవ్వాలని తన పిటిషన్ లో రిక్వెస్ట్ చేశాడు. మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ రూల్స్ పూర్తిగా తుంగలో తొక్కి రాజకీయ ప్రసంగాలలో హత్య కేసు ఉదంతాన్ని ప్రేరేపిస్తున్న వైఎస్ సునీత వైయస్ షర్మిల, పులివెందుల టిడిపి అభ్యర్థి బీటెక్ రవిపై చర్యలు తీసుకోవాల్సిందిగా అభ్యర్థించారు. వీరందరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని ఎలక్షన్ కమిషన్ కు విజ్ఞప్తి చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు వాపోయారు. తక్షణమే రాష్ట్ర అదృత న్యాయస్థానం ఎలక్షన్ కమిషన్ కు ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. పిటిషనర్ దస్తగిరి తరఫు వాదనలు ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వినిపించనున్నారు.

#dastagiri #ys-sunitha-and-sharmila #vivaka-murder-case
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe