Vithika : నా భర్త ఫెయిల్యూర్ హీరో కాదు, నటుడిగా ఎన్నడూ ఫెయిల్‌ అవలేదు.. వితిక ఎమోషనల్ కామెంట్స్!

వరుణ్ సందేశ్ హీరోగా నటించిన 'నింద' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వితిక ఎమోషనల్ కామెంట్స్ చేసింది.' వరుణ్‌ నటుడిగా ఎన్నడూ ఫెయిల్‌ అవలేదు. అతడు ఫెయిల్యూర్‌ యాక్టర్‌ కాదు. ఏ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి గత 17 ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు' అని చెప్పింది.

Vithika : నా భర్త ఫెయిల్యూర్ హీరో కాదు, నటుడిగా ఎన్నడూ ఫెయిల్‌ అవలేదు.. వితిక ఎమోషనల్ కామెంట్స్!
New Update

Vithika Emotional Speech At Nindha Pre Release Event : టాలీవుడ్ (Tollywood) లో కొత్త బంగారు లోకం, హ్యాపీడేస్, ఏమైంది ఈవేళ వంటి సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ సందేశ్ (Varun Sandesh).. గత కొన్నేళ్లుగా పెద్దగా సినిమాలు చేయడం లేదు. భార్య వితికా (Vithika Sheru) తో కలిసి బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చాక అరాకొరా సినిమాలు చేసినా వాటితో అనుకున్న సక్సెస్ అందుకోలేకపోయాడు. అయినా కూడా విభిన్న తరహా కథలు ఎంచుకొని సినిమాలు చేస్తున్నాడు.

అలా చేసిన సినిమానే 'నింద' (Nindha). రాజేశ్‌ జగన్నాధం దర్శకత్వంలో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ సినిమా జూన్‌ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈక్రమంలోనే ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఇందులో వరుణ్ సందేశ్ భార్య తన భర్త ఫెయిల్యూర్ హీరో కాదని, తాను నటుడిగా ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదని ఎమోషనల్ కామెంట్స్ చేసింది.

Also Read : పవన్ కు వదిన సురేఖ ఇచ్చిన పెన్ ఖరీదు అన్ని లక్షలా?

ఎన్నడూ ఫెయిల్ అవ్వలేదు...

" సందేశ్‌ సినిమా ఫంక్షన్స్‌కు నేను రానని చెప్పేదాన్ని. చాలారోజుల తర్వాత మా ఆయన కోసం ఈ ఈవెంట్‌కు రావాలనిపించింది. నింద సినిమా కోసం సందేశ్‌ ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. ఆ విశేషాలన్నీ రోజూ ఇంటికొచ్చి చెప్తుండేవాడు. అయితే చాలామంది రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. మీరు చాలా ఫెయిల్యూర్స్‌ చూశారు కదా.. నటుడిగా ఫెయిలయ్యారు. అవకాశాలు కూడా రావడం లేదు అని మాట్లాడుతున్నారట..

వరుణ్‌ నటుడిగా ఎన్నడూ ఫెయిల్‌ అవలేదు. అతడు ఫెయిల్యూర్‌ యాక్టర్‌ కాదు. ఏ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి గత 17 ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఎవరైతే ఇక సినిమాలు వద్దనుకుని అన్నీ సర్దేసుకుని వెళ్లిపోతారో వాళ్లు మాత్రమే ఫెయిల్యూర్‌ యాక్టర్స్‌. వరుణ్‌ సినిమాలు చేస్తున్నాడు, మున్ముందు కూడా చేస్తూనే ఉంటాడు" అంటూ చెప్పుకొచ్చింది.

#vithika-sheru #tollywood #nindha #varun-sandesh
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe