Vitamin B12: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే విటమిన్ B12 లోపం ఉన్నట్లే జాగ్రత్త .. ?

శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలలో విటమిన్ B12(Cobalamin) అత్యంత ముఖ్యమైనది. ఇది శరీరంలో రక్త కణాల(red blood cells) ఉత్పత్తికి తోడ్పడుతుంది. అలాగే నాడి వ్యవస్థను నిర్వహించడంలో తోడ్పడుతుంది. మన శరీరం సహజంగా విటమిన్ B12 ను ఉత్పత్తి చేయనందున మనం రోజూ తినే ఆహారంలో ఈ పోషకాహారం తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.

New Update
Vitamin B12: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే విటమిన్ B12 లోపం ఉన్నట్లే జాగ్రత్త .. ?

Vitamin B12: మన ఆరోగ్యం రోజు మనం తీసుకునే ఆహారపు అలవాట్లు పై ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే ఆహారం ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది. అందుకోసం మన శరీరానికి అన్ని రకాల పోషకాలు అందేలా చూసుకోవాలి. కానీ మనకు నచ్చకపోవడం వల్ల కొన్ని ఆహారాలను మినహాయింపుగా చేస్తుంటాము. ఇలా చేయడం వల్ల పోషకాహార లోపాలు కలిగే అవకాశం ఉంటుంది. శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలలో విటమిన్ B12(Cobalamin) అత్యంత ముఖ్యమైనది. ఇది శరీరంలో రక్త కణాల(red blood cells) ఉత్పత్తికి తోడ్పడుతుంది. అలాగే నాడి వ్యవస్థను నిర్వహించడంలో తోడ్పడుతుంది. మన శరీరం సహజంగా విటమిన్ B12 ను ఉత్పత్తి చేయనందున మనం రోజూ తినే ఆహారంలో ఈ పోషకాహారం తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.

మానవ శరీరంలో విటమిన్ B12 200 pg\ml కంటే తక్కువగా ఉంటే దీన్ని పోషకాహార లోపంగా భావిస్తారు. శరీరంలో విటమిన్ B12 తక్కువగా ఉంటే ఇది ఆరోగ్యం పై విపరీతమైన ప్రభావం చూపుతుంది.

మీ శరీరంలో విటమిన్ B12 ఈ లక్షణాలు ఉంటే విటమిన్ B12 లోపం ఉన్నట్లే..

అలసట, బలహీనత

శరీరంలో విటమిన్ B12 లోపం వల్ల అలసట, బలహీనత వస్తాయి. విటమిన్ B12 శరీరానికి ఆక్సిజన్(oxygen) అందించే ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. కావున విటమిన్ B12 లోపం వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోయి శరీరంలోని అవయవాలకు సరైన ఆక్సిజన్ అందక అలసట, బలహీనత వస్తాయి. అలాగే త్వరగా అలసిపోవడం, నీరసంగా ఉన్నట్లు అనిపిస్తుంది.

కంటి చూపు సమస్యలు..

విటమిన్ B12 లోపం వల్ల కంటిలోని నరాలు దెబ్బతిని, చూపు మందగిస్తుంది. కళ్ళు మబ్బులుగా కనిపించడం, రంగులను వేరు చేయలేకపోవడం, లేదా కంటి చూపును కోల్పోయే అవకాశం ఉంటుంది.

జ్ఞాపకశక్తి తగ్గిపోవడం

విటమిన్ B12 లోపం కారణంగా జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. దేని పై శ్రద్ధ చూపలేకపోతాము. మతిమరుపు, మబ్బుగా ఉన్నట్లు అనిపిస్తుంది. చిరాకు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తుతాయి.

మౌత్ అల్సర్స్(Mouth Ulcer)

విటమిన్ B12 లోపం వల్ల నోటిలో అల్సర్స్ అవ్వడం. నాలుక వాపు అవ్వడం, ఎర్రబడినట్లు కనిపిస్తుంది. నోట్లోని తినేటప్పుడు చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. 'B' కాంప్లెక్స్ విటమిన్స్ లోపం వల్ల నోటిలో అల్సర్ సమస్యలు ఎక్కువగా వస్తాయి.

చర్మం పసుపు రంగులో మారడం 

విటమిన్ B12 లోపం రక్తహీనతకు దారి తీస్తుంది. రక్తహీనత వల్ల శరీరం పసుపు వర్ణంలోకి మారుతుంది. ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. ఈ పరిస్థితినే "మెగాలోబ్లాస్టిక్ అనీమియా"("megaloblastic anaemia.") అంటారు. మనం తీసుకునే ఆహారంలో విటమిన్ B12 ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు , పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.

Also Read: Health tips: అదే పనిగా కంప్యూటర్‌ ముందు కూర్చోని వర్క్ చేస్తున్నారా? ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు