Mechanic Rocky : 'మెకానిక్ రాకీ' గా మాస్ కా దాస్.. అంచనాలు పెంచేసిన ఫస్ట్ లుక్, రిలీజ్ ఎప్పుడంటే?

విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మెకానిక్‌ రాకీ'. రవితేజ ముళ్లపూడి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సినిమా నుంచి తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. అక్టోబర్ 31 న ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు.

Mechanic Rocky : 'మెకానిక్ రాకీ' గా మాస్ కా దాస్.. అంచనాలు పెంచేసిన ఫస్ట్ లుక్, రిలీజ్ ఎప్పుడంటే?
New Update

Vishwak Sen's Mechanic Rocky First Look : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కెరీర్ పరంగా ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒక్కో సినిమా ఒక్కో జోనర్ కావడం విశేషం. ఈ ఏడాది ఇప్పటికే గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించిన ఈ హీరో ఇప్పుడు మరో హ్యాట్రిక్ మూవీతో రాబోతున్నాడు. ఈసారి కంప్లీట్ కమర్షియల్ మూవీతో ఎంటర్టైన్ చేయబోతున్నాడు.

విశ్వక్ సేన్ (Vishwak Sen) నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మెకానిక్‌ రాకీ'. ఈ చిత్రం ద్వారా రవితేజ ముళ్లపూడి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. పోస్టర్‌లో విశ్వక్‌సేన్‌ ఓ చేతిలో గన్‌, మరో చేతిలో మెకానిక్‌ రెంచ్‌ పట్టుకొని మాస్‌ అవతారంలో కనిపిస్తున్నారు.

విశ్వక్ సేన్ ను సరికొత్త పంథాలో ఆవిష్కరించే మాస్‌ యాక్షన్‌ చిత్రమిదని దర్శకుడు తెలిపారు. మీనాక్షి చౌదరి, నరేష్‌, వైవా హర్ష తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి జేక్స్‌ బిజోయ్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా అక్టోబర్‌ 31న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్‌ తెలిపారు.

#mechanic-rocky-first-look #vishwak-sen
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe