/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Vishwak-Sen-jpg.webp)
మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen).. వెరైటీ సినిమాలతో.. తెలుగు ప్రేక్షకులను ఎప్పటికప్పుడు పలకరిస్తూ వస్తున్నారు. తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో సందడి చేయడానికి సిద్ధం అయిపోయారు. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసి వచ్చే నెలలో సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే సినిమా టీజర్స్.. ట్రైలర్స్.. సింగిల్స్.. సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు పెంచేశాయి.
విశ్వక్ సేన్(Vishwak Sen) గెటప్ అదిరిపోయింది అని ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ అనుకున్నారు. బాగా పెరిగిన మీసం గెడ్డంతో విశ్వక్ లుక్ ఫుల్ మాస్ ఎప్పీరియన్స్ ఇచ్చింది. ఇక సినిమా షూటింగ్ పూర్తి కావడంతో.. విశ్వక్ గాంగ్స్ ఆఫ్ గోదావరి లుక్ కు వీడ్కోలు చెప్పేశారు. తన గెడ్డం.. మీసం ట్రిమ్ చేసి కొత్త లుక్ లోకి వచ్చేశారు. తన గెడ్డం.. మీసం ట్రిమ్ చేసుకుంటున్న వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు విశ్వక్(Vishwak Sen). దానికి క్యాప్షన్ గా మన లంకల రత్న - మాస్ కా దాస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో మీ 17న మీ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు అంటూ చెప్పారు.
Our Lankala Rathna ~ Mass Ka Das @VishwakSenActor is all set to arrive with #GangsOfGodavari at theatres near you on MAY 17th! 🔥🌊
In cinemas #GOGOnMay17th 💥 pic.twitter.com/rmDff4Ppzx
— Sithara Entertainments (@SitharaEnts) April 14, 2024
Also Read: బాక్సాఫీస్ దగ్గర టిల్లూ జోరు.. అట్లుంటది సిద్ధూతోని!!
అంతేకాకుండా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో లంకల రత్న పాత్రకు బై బై అంటూ వీడియోలో విశ్వక్(Vishwak Sen)చెప్పారు. ఇప్పుడు ఈ వీడియో ట్రేండింగ్ లోకి వచ్చింది. సినిమాపై మంచి అంచనాలు ఉండడం.. దానిని మరింత పెంచేలా ప్రచార కార్యక్రమాలు కూడా మొదలు పెడుతున్నట్టు ఈ వీడియో చూస్తే అనిపిస్తుంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ - ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. నేహా శెట్టి హీరోయిన్ గా కనిపిస్తోంది. అంజలి కీలక పాత్రలో కనిపిస్తోంది. గాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.