Gaami Movie Review: కొన్ని సినిమాలు విడుదలకు ముందే చాలా ఆసక్తిని రేకెత్తిస్తాయి. టీజర్లు.. ట్రైలర్లు.. ప్రమోషన్స్ అన్నీ కచ్చితంగా సినిమా చూడాలి అనిపించేలా చేస్తాయి. ఈ మధ్యకాలంలో హనుమాన్ సినిమా తరువాత అలా అంత హైప్ వచ్చిన చిన్న సినిమా గామి. ఎప్పుడో ఐదేళ్ల క్రితం విశ్వక్ సేన్ నటుడిగా ఎంట్రీ ఇస్తున్న కొత్తలో ఈ సినిమా మొదలు పెట్టారు. బడ్జెట్ కష్టాలు దాటుకుని.. ఇప్పటికి థియేటర్లలోకి వచ్చింది. మరి సినిమా టీమ్ ఐదేళ్ల కష్టం నిలబడిందా? ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన ట్రైలర్ టీజర్ లా సినిమా (Gaami Movie Review)కూడా ఆసక్తికరంగా ఉందా? ఈ విషయాలు రివ్యూలో చెప్పేసుకుందాం.
ఈమధ్య వచ్చిన సినిమాలన్నీ ఆరంభంలో లాగ్ అని అందరూ చెప్పుకోవడం వింటూనే వస్తున్నాం. కానీ సినిమా ప్రారంభంలోనే కథలోకి లాక్కెళ్లిపోయే సినిమాలు తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే, క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయాలంటే ఆమాత్రం లాగ్ ఉండాలని అంటారు. ఇప్పుడు గామి(Gaami Movie Review) సినిమా అందుకు విరుద్ధంగా మొదలవుతుంది. సినిమా మొదలు పెడుతూనే నేరుగా కథ మొదలైపోతుంది. ఒక్క కథగా మొదలై.. మూడు కథలుగా మారి చివరకు మళ్ళీ ఒక్క కథగా ముగుస్తుంది. ఈ సినిమా స్పెషాలిటీ అదే. ఇందులో కొత్తదనమూ అదే.
కథేంటంటే..
తానెవరో.. ఎక్కడి నుంచి వచ్చాడో తెలీని శంకర్ అనే ఓ అఘోరా కథ (Gaami Movie Review)ఇది. దీనికి తోడు ఎవరినైనా తాకితే లేదా ఎవరైనా తనని తాకితే అతని శరీరం నీలంగా మారిపోతుంది. దీంతో తోటి అఘోరాలందరూ అతనిని దూరం పెట్టేస్తారు. ఈ క్రమంలో తన ఇబ్బందికి పరిష్కారంగా ఒక గురువు హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వత శ్రేణుల్లో 36 ఏళ్లకు ఒకసారి వికసించే మాలిపత్రాల గురించి చెబుతాడు. దీంతో శంకర్ వాటి కోసం బయలుదేరుతాడు. ఈ ప్రయాణంలో(Gaami Movie Review) అతని తోడుగా డాక్టర్ జాహ్నవి కూడా వెళుతుంది. ఇది ఒక కథ
రెండో కథ సైన్స్ కి సంబంధించింది. ఇక మనుషులను బంధించి అక్రమంగా మందుల ప్రయోగాలు చేసే ఒక ప్రదేశం. అక్కడ నుంచి తప్పించుకోవాలని చూసే ఒక వ్యక్తి.. ఇది రెండో కథ
మూడో కథ దేవదాసి దుర్గ కథ.. ఒక ఊరిలో దేవదాసి దుర్గ.. ఆమె కూతురు వీరి జీవితాల్లోని సంఘర్షణ..
ఈ మూడింటి సమాహారం గామి(Gaami Movie Review)! ప్రారంభం నుంచి చివరి వరకూ తరువాత ఏమిటి అనే ఉత్సుకతను రేకెత్తించే ఈ కథల ప్రయాణం చివరికి ఏమైందో సినిమాలో చూడాల్సిందే. అదే ఈ సినిమా స్క్రీన్ ప్లే కొత్తదనపు ఫ్లేవర్.
Also Read: పుష్ప2 సినిమాలో జాన్వీ కపూర్? ఆ స్పెషల్ సాంగ్ కోసమేనా?
ఎవరెలా చేశారంటే..
అఘోరాగా విశ్వక్ సేన్ సింపుల్ గా చెప్పాలంటే అదరగొట్టేశాడు. విశ్వక్ ని(Gaami Movie Review) ఇంతకూ ముందు అలా ఎప్పుడూ చూసి ఉండలేదు. తన పాత్రకు నూరుశాతం ప్రాణం పోశాడు. ఇక చాందిని కూడా తన నటనతో ఆకట్టుకుంది. సీటీ333 పాత్రలో మహమ్మద్, ఉమ పాత్రలో హారిక, దేవదాసిగా దుర్గ పాత్రలో అభినయ బాగా చేశారు.
సినిమా ఎలా ఉందంటే..
Gaami Movie Review: కచ్చితంగా కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు నూరుశాతం సినిమా నచ్చుతుంది. ముందే చెప్పినట్టు సినిమా మొదలైన దగ్గర నుంచి ప్రేక్షకులు అందులో లీనమైపోతారు. కొంచెం లాజిక్ లెస్ సీన్స్ ఉన్నా.. అవి సినిమా ఫ్లో లో పెద్దగా అనిపించవు. అయినా సినిమా అంటేనే లాజిక్ లెస్ కదా. గ్రాఫిక్స్ సినిమాకి పెద్ద ప్లస్ అయితే, విశ్వనాథ్ ఫొటోగ్రఫీ సినిమాకి ప్రాణం పోసింది. ఈ రెండిటికీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో నరేష్ కుమారన్ మరింత అందాన్ని ఇచ్చాడు. ఇక చివరగా చెప్పుకుంటున్నా.. సినిమాకి సంబంధించిన క్రెడిట్ అంతా ఇవ్వాల్సింది దర్శకుడు విద్యాధర్ కాగిత కు. కొత్త దర్శకుడు తీసిన సినిమాల ఎక్కడా అనిపించడు.
మొత్తంగా చూసుకుంటే.. తక్కువ ఖర్చుతో మనసుకు హత్తుకుపోయే గ్రాఫిక్స్ తో కొత్తదనం నిండిన కథ కథనంతో మెజార్టీ ప్రేక్షకులను గామి అలరిస్తుందని చెప్పుకోవచ్చు.
చివరగా ఒక మాట.. సినిమాకి ఎంత ఖర్చు అయిందన్నది కాదు.. అవుట్ పుట్ ఎంత బాగా వచ్చిందనేది ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలంటే ఇలాంటి సినిమా చూడాల్సిందే.
ఈ సినిమాకి మేమిస్తున్న రేటింగ్ 3.5/5.
గామి సినిమా ట్రైలర్ ఇక్కడ చూడొచ్చు: