/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-10-5.jpg)
Gangs of Godavari OTT Release: టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen), నేహా శెట్టి (Neha Shetty), నటి అంజలి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. కృష్ణ చైతన్య దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఓటీటీ రిలీజ్
అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను కూడా అలరించేందుకు సిద్ధమైంది. విడుదలై నెల రోజులు కాకముందే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) వేదికగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి స్ట్రీమింగ్ స్ట్రీమింగ్ వుతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ వీడియోను రిలీజ్ చేసింది నెట్ ఫ్లిక్స్. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చింది. సితార ఎంటర్ టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. విశ్వక్ హీరోగా నటించిన ఈ సినిమాలో సాయి కుమార్, గోపరాజ్ రమణ ఇతర కీలక పాత్రలు పోషించారు.
Godavari nunchi Mass Ka Das @VishwakSenActor meeku oka mukya prakatana andhisthunnadu.
Watch #GangsOfGodavari now in Telugu, Tamil, Malayalam, Kannada on Netflix! pic.twitter.com/vcBQPRfoy3
— Netflix India South (@Netflix_INSouth) June 14, 2024