Vishnu Priya: బుల్లి యాంకర్ గా పరిచయమైన విష్ణు ప్రియ.. మొదట్లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ తన కెరియర్ మొదలు పెట్టింది. విష్ణు ప్రియ పలు షార్ట్ ఫిలిమ్స్, సాంగ్ ఆల్బమ్స్ లో కూడా నటించింది. రీసెంట్ గా 'దయ' వెబ్ సీరీస్ లో జర్నలిస్ట్ పాత్రలో కనిపించింది. గతంలో విష్ణు ప్రియ, సుధీర్ చేసిన పోవే.. పోరా షో.. విష్ణు ప్రియకు ఆడియన్స్ లో మంచి క్రేజ్ తెచ్చింది. గతేడాది 'వాంటెడ్ పండు గాడు' అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ బ్యూటీ. రీసెంట్ గా యు ట్యూబ్ లో బిగ్ బాస్ ఫేమ్ మానస్, విష్ణు ప్రియ కలిసి చేసిన 'జరీ జరీ పంచే కట్టు' సాంగ్ కొన్ని మిలియన్ వ్యూస్ సాధించింది. వెకేషన్స్, ఫొటో షూట్స్, యాడ్ షూట్స్ ఇలా పలు ఫొటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది ఈ బ్యూటీ.
అయితే ప్రస్తుతం విష్ణు ప్రియ కాస్త డిప్రెషన్ లో ఉన్నట్లుగా కనిపిస్తుంది. అవకాశాలు లేకపోవడం వల్లనా .. లేదా కొంత కాలం గ్యాప్ రావటం కారణమా.. తెలియదు కానీ ఇటీవలే సోషల్ మీడియాలో తాను షేర్ చేసిన ఓ పోస్ట్ లో తన జీవితం డిస్టర్బ్ అయ్యిందని చెప్పుకొచ్చింది.
తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాసుకొచ్చింది.. ఫిజికల్ హెల్త్ ఖరాబ్, కెరీర్ ఖరాబ్, మెంటల్ హెల్త్ ఖరాబ్, రిలేషన్ ఖరాబ్, షెడ్యూల్ ఖరాబ్.. అయినా సరే.. నేను చిల్ అవుతున్నాను” అంటూ రాసుకొచ్చింది. ఇక విష్ణు ప్రియ పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ పోస్ట్ చూసిన వారిలో.. ఆమె ఎవరితో రిలేషన్ లో ఉంది..?, ఆమె ఆరోగ్యానికి ఏమైంది..? ఆమె కెరియర్ కు ఏమైంది..? అంటూ పలు అనుమానాలు వస్తున్నాయి. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది.. మరి విష్ణు ప్రియ ప్రాస బాగుందని ఆ లైన్స్ పెట్టిందా.. లేదా నిజంగానే ఏదైనా జరిగిందా.. అనేది తెలియాలి.
Also Read: Alekhya Harika: హీరోయిన్ గా బిగ్ బాస్ ఫేమ్ అలేఖ్య హారిక