Sujata murder case: మహిళ ప్రాణం తీసిన వివాహేతర సంబంధం..ఆఫీస్‌లోనే హత్య చేసిన వ్యక్తి

వివాహేతర సంబంధం, ఆర్థిక లావాదేవీలు విషయంలో వివాహిత, వ్యక్తి మధ్య మొదలైన ఘర్షణ హత్యకు దారి తీసింది. వేసిన ప్లాన్ ప్రకారం మహిళ పనిచేస్తున్న ఆఫీసుకు వెళ్లి అతి దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. అనంతరం ఎవరికీ డౌట్ రాకుండా తనకు తానుగా గాయపరచుకొని ఆ మహిళ తిరిగి దాడి చేసిందంటూ డ్రామా క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. చివరకు పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది.

New Update
Sujata murder case: మహిళ ప్రాణం తీసిన వివాహేతర సంబంధం..ఆఫీస్‌లోనే హత్య చేసిన వ్యక్తి

విశాఖ నగరంలో అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆఫీస్‌లో ప్రశాంతంగా పనిచేసుకుంటున్న ఓ మహిళను ఓ వ్యక్తి అతి దారుణంగా ఆందరు చూస్తుండగానే పొడిచి చంపాడు. ఆరిలోవ ప్రాంతానికి చెందిన సువ్వాడ సుజాతకు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో విభేదాల కారణంగా 4 నెలలుగా ఆరిలోవ టీఐసీ పాయింట్‌లో తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. పిల్లలను పోషించుకునేందుకు నగరంలోని ఒక హోమ్ అప్లెయిన్స్ షాప్‌లో చేరింది. 10 రోజుల కిందట అక్కడ ఉద్యోగం మానేసి ద్వారకానగర్‌ మూడో లైన్‌లోని సత్య శ్రీదేవి కాంప్లెక్స్‌ మూడో అంతస్తులో ఉన్న ఒక ప్రైవేట్‌ కంపెనీలో టెలీకాలర్‌గా చేరింది. బుధవారం ఉదయం ఎప్పటిలాగే డ్యూటీకి వచ్చింది. ఆరిలోవలో ఉంటున్న పిన్నింటి ఉమామహేశ్వరరావు సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో సుజాత పనిచేస్తున్న కార్యాలయానికి వెళ్లి.. ఆమెను బయటకు పిలిచాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ క్రమంలో ఉమామహేశ్వరరావు తన వెంట తీసుకువెళ్లిన కత్తితో సుజాతను విచక్షణారహితంగా పొడిచాడు. పక్కటెముకల్లో బలమైన గాయమవ్వడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. తర్వాత ఉమామహేశ్వరరావు కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు సమాచారం.

ఇది కూడా చదవండి: మానవసహిత ప్రయోగానికి సర్వం సిద్ధం.. రేప్ గగన్ యాన్ టీవీ డి-1 పరీక్ష

నిత్యం ప్రశాంతంగా ఉండే ఆ కాంప్లెక్స్‌లో ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో సుజాత పనిచేస్తున్న కార్యాలయంలోని సిబ్బంది బయటకు వచ్చి చూసేసరికి సుజాతతోపాటు ఉమామహేశ్వరరావు రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఇంతటి ఘోరాన్ని చూసి వారు ద్వారకా పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ సింహాద్రినాయుడు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అప్పటికే సుజాత మృతిచెందగా, ఉమామహేశ్వరరావు గాయాలతో పడి ఉన్నాడు. సుజాత చేతి వద్ద కత్తి ఉండడంతో ఎవరు ఎవరిని కత్తితో పొడిచారనే దానిపై అయోమయం నెలకొంది. అయితే సుజాత ప్రాణాలు కోల్పోవడంతో ఆమె కత్తితో దాడి చేసే అవకాశం లేదు కాబట్టి, ఉమామహేశ్వరరావే ఆమెను హత్య చేసి, తాను గొంతు కోసుకుని కత్తిని ఆమె చేతిలో పెట్టి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

వివాహేతర సంబంధం నేపథ్యంలోనే..

గాయాలతో పడి ఉన్న ఉమామహేశ్వరరావును కేజీహెచ్‌కు తరలించారు. సుజాత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. ఇదిలావుండగా సుజాత, ఉమామహేశ్వరరావు నాలుగేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నారు. ఉమామహేశ్వరరావుకు కూడా వివాహమై ఒక కుమారుడు ఉన్నాడు. అయినప్పటికీ సుజాత, ఉమామహేవ్వరరావు కలిసి తిరుగుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే హోంగార్డు ఉద్యోగం ఇప్పిస్తానని సుజాత తమ వద్ద నుంచి రూ.ఏడు లక్షలు తీసుకుందని, ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడుగుతుంటే వాయిదా వేసుకుంటూ వస్తోందని ఉమామహేశ్వరరావుతోపాటు అతడి తల్లి ఆరోపిస్తున్నారు. సీఐ సింహాద్రినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయని ఏసీపీ వివేకానంద తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు