MLA Vasupalli Sentenced to Six Months in Jail: వైసీపీ ఎమ్మెల్యే వాసుపల్లికి షాక్.. ఆరు నెలల జైలు శిక్ష విధించిన కోర్టు

వైజాగ్ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు ఎన్నికల వేళ షాక్ ఎదురైంది. ఆయనకి ఆరు నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ విశాఖ రెండో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. విశాఖ సౌత్ నుంచి తెలుగు దేశం పార్టీ తరపున గెలిచి వైసీపీలోకి జంప్ చేశారు వాసుపల్లి గణేష్ కుమార్. వాసుపల్లి ఒక వ్యక్తి మీద దాడి చేసిన కేసులో ఏ2గా ఉన్నారు. దీంతో ఈ కేసును విచారించిన విశాఖ రెండవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు వాసుపల్లికి 6 నెలల సాధారణ జైలుతో పాటు 5 వేల రూపాయలను జరిమానా విధించింది.

MLA Vasupalli Sentenced to Six Months in Jail: వైసీపీ ఎమ్మెల్యే వాసుపల్లికి షాక్.. ఆరు నెలల జైలు శిక్ష విధించిన కోర్టు
New Update

వైజాగ్ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు ఎన్నికల వేళ షాక్ ఎదురైంది. ఆయనకి ఆరు నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ విశాఖ రెండో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. విశాఖ సౌత్ నుంచి తెలుగు దేశం పార్టీ తరపున గెలిచి వైసీపీలోకి జంప్ చేశారు వాసుపల్లి గణేష్ కుమార్. వాసుపల్లి ఒక వ్యక్తి మీద దాడి చేసిన కేసులో ఏ2గా ఉన్నారు. దీంతో ఈ కేసును విచారించిన విశాఖ రెండవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు వాసుపల్లికి 6 నెలల సాధారణ జైలుతో పాటు 5 వేల రూపాయలను జరిమానా విధించింది.

కాగా 2006 నుంచి వైజాగ్ కు చెందిన రామచంద్రారెడ్డి, దుర్గారెడ్డి మధ్య ఆస్తులకు సంబంధించి గొడవలు జరగ్గా.. దీనిపై కోర్టుల్లో కూడా కేసులు నడుస్తున్నాయి. 2008 అక్టోబర్ 29న ఆస్తి విబేధాల విషయంలో రామచంద్రారెడ్డిపై వాసుపల్లి గణేష్, దుర్గారెడ్డి ఇద్దరూ కలిసి దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో తనపై దాడి చేశారంటూ వాసుపల్లి, దుర్గారెడ్డిపై రామచంద్రారెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో గత కొన్నేళ్లుగా కేసుపై విచారణ జరుగుతుండగా.. దాడి చేసినట్లు రుజువు కావడంతో వాసుపల్లి గణేష్‌తో పాటు దుర్గారెడ్డికి శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు వెల్లడించారు.

కాగా వాసుపల్లి తెలుగు దేశం పార్టీ నుంచి రాజకీయ రంగం ప్రవేశం చేశారు. 2009లో తొలిసారి పోటీ చేసి ఓడినా.. ఆ తర్వాత మళ్లీ అదే పార్టీ నుంచి పోటీ చేసి 2014, 2019లో గెలిచారు. అనంతరం 2020లో వైసీపీలో చేరారు. 2024లో ఆ పార్టీ నుంచే పోటీ చేయాలని రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో పాత కేసుగా ఉన్న ఈ కేసులో తీర్పు రావడం.. జైలు శిక్ష ఖరారు కావడంతో ఆయన అనుచరులు కలవర పడుతున్నారు.

అయితే ఈ కేసులో అప్పీల్ కు వెళ్తానని అంటున్నారు ఎమ్మెల్యే వాసుపల్లి. అధికార పార్టీలో చురుకుగా ఉంటూ వస్తున్న వాసుపల్లి.. మళ్లీ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఈ తరుణంలో ఈ కేసు ఆయనకు చిక్కుగా మారింది. అలాగే రాజకీయంగా కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదు.

మరి ఈ సారి టికెట్ ఈయనకు వస్తుందో లేదో చూడాలి. ఈ కేసులో పడిన శిక్ష ఆరునెలలే కాబట్టి.. రాజకీయంగా పోటీ చేసేందుకు ఇబ్బంది లేకపోవచ్చు కానీ ప్రజా జీవితంలో ఉన్న వారి మీద ఇలాంటి వస్తే ప్రత్యర్థులకు ఇవి కాస్తా ఆయుధాలుగా మారే అవకాశం ఏ మాత్రం లేకపోలేదు. మరి మున్ముందు ఈయన ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో చూడాలి.

#sentenced-to-six-months-jail #mla-vasupalli-ganesh #visakhapatnam-south-mla-vasupalli-ganesh #jail #visakhapatnam #crime
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe