విశాఖలో ఠాగూర్ సినిమాను తలదన్నే ఘటన చోటు చేసుకుంది. అబం శుభం తెలియని పసికందు నిండు జీవితంతో( medicover) ఆస్పత్రి వైద్యులు చెలగాటం ఆడారు.ఇంతకీ ఏం జరిగింది అనుకుంటున్నారా? అయితే చూద్దాం పదండి.
కూటి కోసం కోటి విద్యలు
అమ్మ కడుపులో నుంచి అప్పుడే పుట్టిన చిన్నారి క్షేమంగానే ఉంది. బిడ్డ ఆరోగ్యంగా ఉండటంతో అందరూ సంతోషంగా ఉన్నారు. ఇంతలో ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ.. చిన్నారికి ఆపరేషన్ (Child operation) చేయాలంటూ డాక్టర్లు గేమ్‌ను స్టార్ట్ చేశారు. వైద్యానికి సుమారు 10 లక్షల వరకు ఖర్చు అవుతుందంటూ డాక్టర్లు తల్లిదండ్రులకు చెప్పారు. నిన్నటి వరకు బాగానే ఉన్నా బాలుడికి.. ఒక్కసారిగా ఏమైందంటూ కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. నిన్న చేసిన వైద్య పరీక్షల్లో (Medical tests) బాబు బాగానే ఉన్నాడని చెప్పి.. ఇంత లోనే మాట మార్చారు. బాబుకి హెల్త్ బాలేదు ఆపరేషన్ చేయాలి పది లక్షలు ఖర్చు అవుతుందని ఓ స్టోరీని క్రీయేట్ చేశారు. అంతేకాకుండా ఈరోజు ఉదయం బాబు చనిపోయాడని ఆస్పత్రి సిబ్బంది (Hospital staff) చెప్పడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అంతేకాకుండా మూడు లక్షల 50 వేలు ఇస్తేనే.. బాలుడి మృతదేహం ఇస్తామంటూ వైద్యులు బేరాలు (Doctors) అడుతున్నారు.
గతంలో కూడా ఎలాంటి దందాలే..
మెడికవర్ యాజమాన్యం అరాచకాలు రోజురోజుకు బయట పడుతున్నాయి. గతంలో కూడా శవాలకు ట్రీట్‌మెంట్ (Treatment)పేరుతో లక్షల్లో ఫీజులు వాసూళ్లు చేశారు. రోగుల అవయవాలు అమ్ముకుంటున్నారనే ఆరోపనలు కూడా వెలుగు చూశాయి. ఇప్పుడు ఆదే యాజమాన్యం డబ్బులు కోసం మనిషి ప్రాణాలతో ఇలాంటి దందాలు బయట పడుతున్నాయి. ఈ ఘటనపై స్పందించన మెడికవర్ ఎండీ (Unresponsive medicover MD) ఇది మెడికవర్ ఇష్యూ.. బాబు చనిపోయాడని ఎవరూ చెప్పకలేదని చెబుతున్నారు. ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ బాబు చనిపోయాడని చెప్పలేదన్నారు.బాబు క్రిటికల్ కండీషన్‌లో ఉన్నాడని చెప్పాం అంతే అని వివరించాడు. ఈ ఘటనపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంత జరుగుతున్న జిల్లా వైద్యశాఖ ( District Medical Department) యంత్రాంగం పట్టించుకోవటంపై విశాఖ వాసులు మండిపడుతున్నారు.