విశాఖలో పూర్ణానంద స్వామీజీ అరెస్ట్ విశాఖలో ఓ స్వామీజీ బాగోతం బయటపడింది. రెండేళ్లుగా బాలికను అత్యాచారానికి గురి చేస్తున్న కిరాతకున్ని అరెస్టు చేశారు. బాలిక ఫిర్యాదుతో స్వామీజీపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. By Vijaya Nimma 20 Jun 2023 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి బాలికపై రెండేళ్లుగా అత్యాచారం ఆరోపణలపై ఓ విశాఖలోని జ్ఞానానంద ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద స్వామీజీ అరెస్టయ్యారు. స్వామీజీ తనపై అత్యాచారం చేస్తున్నారన్న రాజమహేంద్రవరానికి చెందిన అనాథ బాలిక ఫిర్యాదుపై గత స్వామీజీని పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోవడంతో బాలికను చేరదీసిన బంధవులు 5వ తరగతి వరకు చదివించారు. రెండేళ్ల క్రితం విశాఖలోని కొత్త వెంకోజీపాలెంలో ఉన్న జ్ఞానానంద ఆశ్రమంలో చేర్పించారు. అక్కడ గత స్వామీజీ ఆమెతో ఆవులకు మేత వేయించడం, పేడ తీయించడం వంటి పనులు చేయించేవారు. రాత్రుళ్లు తన గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసేవారు. ఏడాదిగా బాలికను తన గదిలోనే గొలుసులతో బంధించారు. ఎదురు తిరిగితే కొట్టేవారు. రెండు చెంచాల అన్నాన్ని మాత్రమే పెట్టేవారని, కాలకృత్యాలకు అనుమతించకపోయేవారని, వారానికి ఒకసారి మాత్రమే స్నానానికి వెళ్లనిచ్చేవారని బాలిక తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాపాడిన రైలు ప్రయాణికురాలు ఈ క్రమంలో ఈ నెల 13న పనిమనిషి సాయంతో బాలిక ఆశ్రమం నుంచి బయటపడింది. రైల్వే స్టేషన్‌కు చేరుకుని తిరుమల ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. అక్కడ తనకు పరిచయమైన ప్రయాణికురాలికి తన బాధను చెప్పుకుంది. ఆ మహిళ బాలికను తనతోపాటు తీసుకెళ్లి 2 రోజుల క్రితం కృష్ణా జిల్లా కంకిపాడులోని ఓ హాస్టల్‌లో చేర్పించేందుకు ప్రయత్నించింది. అయితే, పోలీసుల నుంచి లేఖ తీసుకొస్తేనే జాయిన్ చేసుకుంటామని చెప్పడంతో కంకిపాడు పీఎస్‌కు వెళ్లి పోలీసులు ఇచ్చిన అనుమతి లేఖను తీసుకున్నారు. స్వామీజీపై పోక్సో కేసు నమోదు అక్కడి నుంచి బాలికను తీసుకుని బాలల సంక్షేమ కమిటీకి వెళ్లగా, ఆశ్రమంలో తాను అనుభవించిన నరకం గురించి బాలిక చెప్పుకొచ్చింది. నిర్ఘాంతపోయిన వారు బాలికతో కలిసి విజయవాడ దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్వామీజీపై పోక్సో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు. బాలిక ఫిర్యాదుపై స్వామీజీని విశాఖలో అదుపులోకి తీసుకున్నారు. ఆశ్రమ భూములే టార్గెట్ బాలిక ఆరోపణల్లో ఎంతమాత్రమూ నిజం లేదని పూర్ణానంద స్వామీజీ కొట్టిపడేశారు. ఆశ్రమ భూములను కొట్టేయాలని కొందరు చూస్తున్నారని, అందులో భాగంగానే కుట్ర చేసి బాలికతో ఇలా ఆరోపణలు చేయిస్తున్నారని అన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. కాగా, ఆశ్రమం నుంచి బాలిక అదృశ్యమైనట్టు ఈ నెల 15న ఆశ్రమ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి