Vizag Harbour Fire: హార్బర్‌లో అరాచకాలు! మందు పార్టీలు, గంజాయి బ్యాచ్‌లు!

విశాఖ హార్బర్‌ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. మందు పార్టీలకు, గంజాయి బ్యాచ్‌లకు డెన్‌గా మారింది. బోట్లకు మంటల అంటుకోవడంతో నిజాలు బయటకొచ్చాయి. హార్బర్‌లో పోలీసుల నిఘాలేని ప్రాంతాలను అడ్డాగా మార్చుకున్న ఆకతాయిలు చెలరేగిపోతున్నారు.

Vizag Harbour Fire: హార్బర్‌లో అరాచకాలు! మందు పార్టీలు, గంజాయి బ్యాచ్‌లు!
New Update

దేశ వ్యాప్తంగా ప్రాముఖ్యత ఉన్న వైజాగ్(Vizag) హార్బర్ లో నిఘా లోపాలు, భద్రత లోపాలు కలవరపెడుతున్నాయి. ఈ నెల 19 రాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాదం హార్బర్ చరిత్రలోనే మొదటిసారి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మత్స్యకారుల డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు విశాఖ హార్బర్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మందు పార్టీలకు, గంజాయి బ్యాచ్‌లకు అడ్డాగా హార్బర్‌ మారినట్లు తెలుస్తోంది.

పోలీసుల నిఘాలేని ప్రాంతాల్లో జల్సాలు:

జెట్టిలో ఉన్న బోట్లలో మందు పార్టీలు జరుగుతున్నాయి. బోట్లకు మంటల అంటుకోవడంతో నిజాలు బయటకొచ్చాయి. హార్బర్‌లో పోలీసుల నిఘాలేని ప్రాంతాలను అడ్డాగా మార్చుకున్న ఆకతాయిలు అక్కడ అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్నారు. మందు పార్టీతోనే తాజా ఘటన జరగడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. సిగరెట్‌ ఆర్పకుండా పడేయటంతోనే వలకు నిప్పు అంటుకుని భారీ అగ్నిప్రమాదం జరిగినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇక గంజాయి సేవిస్తూ పట్టుబడిన వారిపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు.

అనుమానంతో అరెస్ట్.. విడుదల:

పోలీసుల అనుమానమే లోకల్ బాయ్ నాని కొంప ముంచింది. హార్బర్ ప్రమాద ఘటన తరువాత నానిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నానితో సహా మరి కొంతమందిని ప్రశ్నించారు పోలీసులు. విచారణ అనంతరం అందరినీ విడుదల చేసి.. నానిని మాత్రం పోలీసుల అదుపులోనే ఉంచారు.. దీంతో మొదటి నుంచి అనుమానితుడిగా ఉన్న నానిపై అందరికీ మరింత అనుమానం పెరిగింది. హైకోర్టులో నాని కుటుంబ సభ్యుల పిటిషన్ తో నాని విడుదల అయ్యాడు. కోర్టులో కేసు వేసిన క్రమంలో కూడా నాని పోలీసులపై అనేక ఆరోపణలు చేశారు. పోలీసులు తనని కొట్టారంటూ వాపోయాడు. తనకు ఏ పాపం తెలియదన్నా పోలీసులు వదలలేదని బాధపడ్డాడు. ఇక సీన్‌ కట్ చేస్తే వాసుపల్లి నాని( లోకల్ బాయ్ నాని కాదు ), సత్యం అనే ఇద్దరు ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు. యూట్యూబర్ నాని కేవలం అనుమానితుడే అందుకే ఆయన్ను విచారించామని చెప్పి చేతులు దులుపుకున్నారు పోలీసులు.

Also Read: విశాఖ హార్బర్‌ అగ్ని ప్రమాదం కేసులో కొత్త ట్విస్ట్‌..సీసీ ఫుటేజ్‌ విడుదల!

WATCH:

#vizag #vizag-harbor #visakha-harbour-fire-incident
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe