విశాఖ కానిస్టేబుల్ హత్య కేసులో దర్యాప్తు వేగవంతం.. పోలీసుల అదుపులో భార్య శివజ్యోతి

వివాహేతర సంబంధాలు ఈ మధ్యకాలంలో పచ్చని కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. అలాంటి ఘటనలు వరసగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ వివాహేత సంబంధ పచ్చని కాపురంలో చిచ్చుపెట్టింది. జీవితాంతం కలిసి ఉండాల్సిన భార్య వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తనే హతమార్చింది. ఈ ఘటన ఇప్పుడు విశాఖ జిల్లాలో కలకలం రేపుతోంది.

New Update
విశాఖ కానిస్టేబుల్ హత్య కేసులో దర్యాప్తు వేగవంతం.. పోలీసుల అదుపులో భార్య శివజ్యోతి

విశాఖపట్నంలో వన్ టౌన్ కానిస్టేబుల్ రమేష్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. రమేష్ భార్య తన ప్రియుడు, అతని స్నేహితుడు సహాయంతో భర్తను అంతమొందించింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్త కానిస్టేబుల్ రమేష్‌ను పక్కా స్కెచ్‌తో భార్య హతమార్చిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇంట్లోనే పథకం ప్రకారం తలగడా దిండుతో హత్య చేసి భార్య శివజ్యోతి అలియాస్ శివాని గుండెనొప్పిగా చిత్రకరించింది. ట్యాక్సీ డ్రైవర్‌తో వివాహేతర సంబంధమే హత్యకు కారణమైంది. భార్య గుట్టుచప్పుడుగా అంతక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఎంవీపీ పోలీసుల విచారణలో భార్య అక్రమ సంబంధం బాగోతం వెలుగు చూసింది. బర్రి రమేష్ 2009లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరారు.

అయితే కానిస్టేబుల్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కానిస్టేబుల్ రమేష్ హత్య కేసులో ఇద్దరు నిందితులను ఎంవీపీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న రమేష్ భార్య శివజ్యోతిను అన్ని కోణాల్లో విచారించిన పోలీసులు..దాదాపుగా హత్యగానే నిర్దారించారు. సాయంత్రంలోపు వివరాలు వెల్లడిస్తామని సీపీ త్రివిక్రమ్ వర్మ తెలిపారు.

కానిస్టేబుల్ రమేష్ కేసుపై Rtvతో ఎంవీపీ సీఐ మల్లేశ్వరరావు మాట్లాడిన్నారు. రమేష్ అన్నయ్య అప్పలరాజు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామన్నారు. రమేష్ మృతి కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామన్నారు. రమేష్ సేవలు డిపార్ట్‌మెంట్‌లో మరువలేనివి అన్నారు. సిటీలో చాలా స్టేషన్ల పరిధిలో రమేష్ పని చేశాడు చాలా మంచివాడని మల్లేశ్వరరావు అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు