అతను క్రికెట్‌కు దక్కిన గొప్ప క్రీడాకారుడు.. విరాట్ పై వివ్ రిచర్డ్స్

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వివ్ రిచర్డ్స్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఎంతోమంది గొప్ప ఆటగాళ్లున్నా వీళ్లందరిలో టాప్ విరాట్ కోహ్లీనే అన్నారు. సచిన్ లాంటి క్రికెట్ దిగ్గజాల్లో ఒకడిగా విరాట్ నిలిచిపోతారంటూ పొగిడేశారు.

New Update
అతను క్రికెట్‌కు దక్కిన గొప్ప క్రీడాకారుడు.. విరాట్ పై వివ్ రిచర్డ్స్

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వివ్ రిచర్డ్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఎంతోమంది గొప్ప ఆటగాళ్లను చూశాం. కానీ వీళ్లందరిలో టాప్ ఎవరంటే మాత్రం విరాట్ కోహ్లీనే. నేను అతడికి పెద్ద ఫ్యాన్. సచిన్ లాంటి క్రికెట్ దిగ్గజాల్లో ఒకడిగా విరాట్ నిలిచిపోతాడు అంటూ కోహ్లీని తెగ పొగిడేశాడు.

రీసెంట్ గా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న వివ్ రిచర్డ్స్.. ప్రపంచకప్ ముందు విరాట్ ఫామ్‌లేమితో సతమతమైన విషయాన్ని కూడా వివ్ ప్రస్తావించాడు. 'ప్రపంచకప్ ముందు అతడు క్లిష్టపరిస్థిని ఎదుర్కోవాల్సి వచ్చింది. అతడు జట్టులో అవసరం లేదన్నారు. కానీ విరాట్ మళ్లీ ఫామ్ సాధించడంలో అతడి వెన్నంటి ఉన్నవారు, బ్యాక్ రూం స్టాఫ్‌‌కే క్రెడిట్ దక్కుతుంది. ఇప్పుడతను మళ్లీ అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. క్రికెటర్ల ఫామ్ తాత్కాలికమని అంటారు కానీ విరాట్ తాను ప్రత్యేకమని నిరూపించుకున్నాడు. అతడిని చూస్తే నాకు సంతోషంగా ఉంది. గేమ్ పై చాలా ఫోకస్ చేస్తున్నాడు. అతను క్రికెట్‌కు దక్కిన ఓ గొప్ప క్రీడాకారుడు' అంటూ కితాబిచ్చాడు.

Also read :షకిబ్‌కు రాళ్ల దెబ్బలు తప్పవు.. మాథ్యూస్‌ సోదరుడు సీరియస్ వార్నింగ్

ఈ క్రమంలోనే విరాట్‌ను తనతో పోల్చడంపై స్పందించిన వివ్.. 'గ్రౌండ్ లో మా ఇద్దరి తీరు ఒకేలా ఉండటంతో కొందరు విరాట్‌ను నాతో పోలుస్తుంటారు. క్రికెట్‌పై అతడికున్న ఆసక్తి నాకు నచ్చుతుంది. ఏ పొజిషన్‌లో ఆడుతున్నా.. టీం బౌలర్లు ప్యాడ్స్ టచ్ చేసినా వెంటనే అప్పీలుకు వెళుతుంటాడు. అతడి దృష్టి ఎప్పుడూ గేమ్‌పైనే ఉంటుంది. అలాంటి వ్యక్తులంటే నాకు చెప్పలేని అభిమానం' అన్నాడు. అంతేకాదు ఫామ్‌ కోల్పోయినా మళ్లీ సత్తా చాటడానికి అతడికి అతడే స్ఫూర్తి. విరాట్‌ క్లిష్ట సమయాల్లోనూ గొప్ప మానసిక స్థెర్యంతో ముందుకు సాగుతుంటాడని చెప్పాడు.

Advertisment
తాజా కథనాలు