/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/kohli-vs-gambhir-jpg.webp)
గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ తన్నులాటల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు ఎప్పుడు ఎదురుపడ్డా ఏం జరుగుతుందోనన్న టెన్షన్ ఫ్యాన్స్‌లో ఉంటుంది. గ్రౌండ్‌లోనే దాదాపు కొట్టుకునే అంత కోపం ఈ ఇద్దరికి. ఇద్దరూ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేరు. కోపాన్ని బహిరంగంగానే చూపించేస్తారు. ఈ ఏడాది( 2023)ఐపీఎల్‌లో మరోసారి గంభీర్ వర్సెస్ కోహ్లీ ఫైట్ జరిగింది. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇద్దరూ ఒకరిపై ఒకరు దూసుకెళ్లారు. సహచరులు అడ్డుపడడంతో కాసేపటి తర్వాత గొడవ సద్దుమణిగింది. ఇక తాజాగా గంభీర్ కోహ్లీతో గొడవపై కామెంట్స్ చేశాడు.
Gautam Gambhir cheekily tells rivalry with Virat is on the field only, not off the field. Here he answers a tough question on one of the most memorable moments of Kohli.pic.twitter.com/afDoFGPQ0O
— Knight Vibe (@KKRiderx) December 22, 2023
అదంతా గ్రౌండ్‌లోనే:
విరాట్ కోహ్లీ తన 50వ వన్డే సెంచరీని ఏ బౌలర్‌పై చేశాడు? అని గంభీర్‌ని స్టార్ స్పోర్ట్స్‌లో అడిగారు. న్యూజిలాండ్ పేసర్ లాకీ ఫెర్గూసన్ వేసిన బంతితో కోహ్లీ 50వ సెంచరీ సాధించాడని గంభీర్ వెంటనే రియాక్ట్ అయ్యాడు. అక్కడే ఉన్న పియూష్ చావ్లా గంభీర్ సమాధానం విని సంతోషించాడు. విరాట్ కోహ్లీతో తన పోరాటం కేవలం ఫీల్డ్‌కే పరిమితమైందని గంభీర్ స్పష్టం చేశాడు. 'దయచేసి ఈ క్లిప్‌ను మళ్లీ మళ్లీ చూపించండి. నాకు అన్నీ గుర్తున్నాయి. నా పోరాటం మైదానంలో మాత్రమే' అని గంభీర్ చెప్పాడు.
కోహ్లీ-గంభీర్ టీమిండియాతో పాటు ఢిల్లీ రంజీ జట్టు కోసం కలిసి ఆడారు. వీరిద్దరూ 2011 శ్రీలంకతో ఫైనల్‌లో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనేక కీలక భాగస్వామ్యాలను పంచుకున్నారు. మరో ఎండ్‌లో గంభీర్ ఉన్నప్పుడే కోహ్లీకి తొలి వన్డే సెంచరీ కూడా వచ్చింది. ఆ మ్యాచ్‌లో గంభీర్‌కు వచ్చిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కోహ్లీతో కలిసి పంచుకున్నాడు. అయితే 2013 ఐపీఎల్‌లో బెంగళూరు, కోల్‌కతా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఇద్దరికి తొలిసారి గొడవ జరిగింది.
Also Read: ఈ అవార్డులు మాకొద్దు.. పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తున్న మరో టాప్ రెజ్లర్!
WATCH: