Virat Kohli : ఇన్‌స్టాలో ఒక్కో పోస్టుకు కోహ్లీ ఆదాయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

రన్‌మెషీన్‌ కింగ్ కోహ్లీ గురించి పెద్దగా చెప్పేదేముంది. తన ఆటతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను దక్కించుకున్న కోహ్లీ.. సోషల్ మీడియాలోనూ మోస్ట్ పాపులర్ సెలబ్రెటీగా ముందు వరుసలో ఉంటాడు.

Virat Kohli : ఇన్‌స్టాలో ఒక్కో పోస్టుకు కోహ్లీ ఆదాయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
New Update

Virat Kohli :టీమిండియాలో లెజెండ్ ప్లేయర్ సచిన్ తర్వాత అంతటి పాపులారిటీ దక్కించుకున్న ప్లేయర్ విరాట్‌ కోహ్లీ. యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉన్న కోహ్లీ.. వాటర్ తాగినంత ఈజీగా సెంచరీల మీద సెంచరీలు బాదేస్తూ రన్‌మెషీన్‌గా పేరు దక్కించుకున్నాడు. అలాగే మోస్ట్ సక్సెస్‌ఫుల్ టెస్టు కెప్టెన్లలో ఒకడిగా రికార్డు కూడా క్రియేట్ చేశాడు. కేవలం ఆట పరంగానే కాదు సంపాదనలోనూ రికార్డులు కొల్లగొడుతున్నాడు. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో కోహ్లీకి కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 256 మిలియన్లు, ఫేస్‌బుక్‌లో 50 మిలియన్లు, ట్విట్టర్‌లో 51 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ కోహ్లీని అనుసరిస్తున్నారు. దీంతో ఇండియాలోనే కాదు, ఆసియా ఖండంలోనే మోస్ట్ ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీగా చరిత్ర సృష్టించాడు.

publive-image

ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) లో 256 మంది మిలియన్లు ఉన్న కోహ్లీ (Virat Kohli) ఒక్కో పోస్ట్ ద్వారా భారీగానే సంపాదిస్తున్నాడు. హోపర్ ఇన్‌స్టాగ్రామ్ రిచ్ లిస్ట్- 2023 పేరుతో ఇన్‌స్టాలో అత్యధికంగా సంపాదిస్తున్న టాప్‌ 20 స్టార్స్‌ జాబితా తాజాగా విడుదలైంది. ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్న విరాట్.. ఒక్కో స్పాన్సర్డ్‌ పోస్ట్‌కి రూ.11.45 కోట్లు అందుకుంటున్నాడు. ఇక అగ్రస్థానంలో ఉన్న ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఒక్కో స్పాన్సర్డ్‌ పోస్ట్‌కు 3.23 మిలియన్లు(రూ.26.75 కోట్లు), రెండో స్థానంలో ఉన్న లియోనెల్‌ మెస్సీ ఒక్కో ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌కు 2.56 మిలియన్లు(రూ.21.49కోట్లు) అందుకుంటున్నారు. ఇండియా క్రీడాకారుల నుంచి కోహ్లీ ఒక్కడే ఈ లిస్టులో చోటు దక్కించుకోవడం విశేషం.

publive-image

ట్విట్టర్‌లో ఒక్కో పోస్ట్‌కి రూ.3 కోట్ల వరకూ అందుకుంటున్న కోహ్లీ.. వివిధ స్టార్టప్స్‌లోనూ పెట్టుబడులు పెట్టాడు. అలాగే మింత్రా, ఉబర్, ఎంఆర్‌ఎఫ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, వివో వంటి డజనుకి పైగా బ్రండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో A+కేటగిరిలో ఉన్న కోహ్లీ.. ఏడాదికి రూ.7 కోట్లు అందుకుంటున్నాడు. ఒక్కో టెస్టు మ్యాచ్ ద్వారా రూ.15 లక్షలు, ఒక్కో వన్డే మ్యాచ్ ద్వారా రూ.6 లక్షలు, ఒక్కో టీ20 మ్యాచ్ ద్వారా రూ.3 లక్షలు తీసుకుంటున్నాడు. ఇవి కాకుండా ఐపీఎల్‌లో ఆర్‌సీబీ నుంచి రూ.16 కోట్లు పుచ్చుకుంటున్నాడు. ఇలా మొత్తంగా రెండు చేతులా కోట్లలో సంపాదిస్తున్నాడు కింగ్.

publive-image

ఇక ఈ జాబితాలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు 88 మిలియన్ల ఫాలోవర్లతో ఇండియా నుంచి ఇన్‌స్టాలో ఎక్కువగా సంపాదించే సెలబ్రిటీల లిస్ట్‌లో రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 29వ స్థానంలో ఉంది. ప్రియాంక ఒక్కో ఇన్‌స్టా పోస్ట్‌కు రూ. 4 కోట్లకుపైగా వసూలు చేస్తుంది. ఇండియా నుంచి వీరిద్దరూ మాత్రమే ప్లేస్ దక్కించుకున్నారు.

Also Read: వరల్డ్‌ కప్‌లో భారత్‌ ఆడే మ్యాచ్‌ తేదీల్లో మార్పులు!

#virat-kohli #virat-kohli-highest-earning-indian-from-instagram #instagram-highest-paid-celebrety #virat-kohli-named-instagrams-top-earner-from-india
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe