Virat Kohli : ఇక చాలు.. పోయి బెంచ్‌పై కుర్చో.. ఇదేం ఐపీఎల్‌ కాదు..!

ఇంగ్లండ్‌పై జరిగిన సెమీస్‌ ఫైట్‌లోనూ కోహ్లీ అట్టర్‌ఫ్లాప్‌ అయ్యాడు. 9 బంతుల్లో 9 పరుగులే చేశాడు. ఈ టీ20 WCలో కోహ్లీ 10.71 సగటుతో 100 స్టైక్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేస్తూ తీవ్రంగా నిరాశపరిచాడు. సెమీస్‌ వరకు ఇప్పటివరకు 7 ఇన్నింగ్స్‌లలో కేవలం 75 పరుగులు మాత్రమే చేశాడు కోహ్లీ.

Virat Kohli : ఇక చాలు.. పోయి బెంచ్‌పై కుర్చో.. ఇదేం ఐపీఎల్‌ కాదు..!
New Update

T20 World Cup 2024 : ఐపీఎల్‌ (IPL) లో ఆరెంజ్‌ క్యాప్‌తో బౌలర్లను ఊచకోత కోసిన విరాట్‌ కోహ్లీ (Virat Kohli) టీ20 వరల్డ్‌కప్‌లో మాత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అపుతున్నాడు. వెస్టిండీస్‌, అమెరికా పిచ్‌లపై కోహ్లీ ఆట సెట్‌ కాదని ముందునుంచే సెలక్టర్లు చెబుతున్న వాదన నిజమైంది. నిజానికి కోహ్లీని వెస్టిండీస్‌ గడ్డపై టీ20లకు పంపడం సెలక్టర్లకు ఇష్టం లేదు. అయినా కోహ్లీ ఆడతానని చెప్పడం.. టీ20 వరల్డ్‌కప్‌కు ముందు జరిగిన ఐపీఎల్‌లో దుమ్మురేపడంతో కోహ్లీ ఎంపిక అనివార్యమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓపెనర్‌గా బరిలోకి దిగిన కోహ్లీ ఈ టీ20 వరల్డ్‌కప్‌ మొత్తం చెత్త ప్రదర్శన చేశాడు. ఐపీఎల్‌లో ఓపెనర్‌గా పరుగులు వరదలై పారించిన కోహ్లీ అంతర్జాతీయ టీ20 ఓపెనర్‌గా మాత్రం అత్యంత ఘోరంగా ఆడుతున్నాడు.


అదే పొరపాటు.. ప్రతీసారి ఇంతేనా?
గ్రూపు మ్యాచ్‌లు, సూపర్‌-8 దశలో ఏ మాత్రం రాణించని కోహ్లీ సెమీస్‌లోనైనా మెరుస్తాడని అంతా భావించారు. అయితే ఇంగ్లండ్‌ (England) పై జరిగిన సెమీస్‌లోనూ కోహ్లీ ఆట చాలా దారుణంగా కనిపించింది. తన సహజశైలికి భిన్నంగా లాఫ్ట్‌ షాట్లపైనే ఫోకస్‌ పెట్టిన కోహ్లీ టాప్లి వేసిన బంతికి క్లీన్‌ బౌల్డ్ అయ్యాడు. కోహ్లీ ఆట తీరును మాజీ కోచ్‌ రవిశాస్త్రి సైతం తప్పుబట్టాడు. ఇది కోహ్లీ నేచురల్‌ గేమ్‌ కాదని చెప్పుకొచ్చాడు. రవిశాస్త్రి మాటలతో అటు టీమిండియా ఫ్యాన్స్ సైతం ఏకీభవిస్తున్నారు. ఎందుకంటే వికెట్‌ కాపాడుకోవాల్సిన చోటు భారీ షాట్లకు పోయి వికెట్‌ ఇచ్చుకోవడం కోహ్లీ గతంలో చేసిన దాఖలాలు చాలా చాలా తక్కువ. కానీ ఈ టీ20 వరల్డ్‌కప్‌లో మాత్రం కోహ్లీ పదేపదే ఈ పొరపాటు చేస్తూ టీమిండియాకు భారంగా మారాడు.

పొజిషన్‌ మార్చాలా?
ఇంగ్లండ్‌పై తొమ్మిది బంతుల్లో తొమ్మిది పరుగులు మాత్రమే చేసిన 35 ఏళ్ల కోహ్లీ ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్‌లో 10.71 సగటుతో మాత్రమే బ్యాటింగ్‌ చేస్తున్నాడు. స్ట్రైక్ రేట్‌ కూడా 100 మాత్రమే ఉంది. ఇది టీ20లకు ఏ మాత్రం సరిపోని స్ట్రైక్‌ రేట్‌. సెమీస్‌ వరకు ఇప్పటివరకు 7 ఇన్నింగ్స్‌లలో కేవలం 75 పరుగులు మాత్రమే చేశాడు కోహ్లీ. అటు కోహ్లీ కారణంగా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తోంది. నిజానికి కోహ్లీ భారత్‌ (India) తరుఫున వన్‌ డౌన్‌లో బ్యాటింగ్‌ చేస్తాడు. అయితే ఈసారి మాత్రం ఓపెనర్‌గా అతడిని ప్రమోట్ చేయడం తప్పు అని ఇప్పటికే అర్థమైంది.

Also Read: ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించిన ఇండియా..ఫైనల్స్‌లోకి ఎంట్రీ

#virat-kohli #t20-world-cup-2024 #england #2024-ipl-cup
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe