T20 World Cup 2024 : ఐపీఎల్ (IPL) లో ఆరెంజ్ క్యాప్‌తో బౌలర్లను ఊచకోత కోసిన విరాట్ కోహ్లీ (Virat Kohli) టీ20 వరల్డ్‌కప్‌లో మాత్రం అట్టర్ ఫ్లాప్ అపుతున్నాడు. వెస్టిండీస్, అమెరికా పిచ్‌లపై కోహ్లీ ఆట సెట్ కాదని ముందునుంచే సెలక్టర్లు చెబుతున్న వాదన నిజమైంది. నిజానికి కోహ్లీని వెస్టిండీస్ గడ్డపై టీ20లకు పంపడం సెలక్టర్లకు ఇష్టం లేదు. అయినా కోహ్లీ ఆడతానని చెప్పడం.. టీ20 వరల్డ్‌కప్‌కు ముందు జరిగిన ఐపీఎల్లో దుమ్మురేపడంతో కోహ్లీ ఎంపిక అనివార్యమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓపెనర్‌గా బరిలోకి దిగిన కోహ్లీ ఈ టీ20 వరల్డ్‌కప్ మొత్తం చెత్త ప్రదర్శన చేశాడు. ఐపీఎల్లో ఓపెనర్‌గా పరుగులు వరదలై పారించిన కోహ్లీ అంతర్జాతీయ టీ20 ఓపెనర్‌గా మాత్రం అత్యంత ఘోరంగా ఆడుతున్నాడు.
పూర్తిగా చదవండి..Virat Kohli : ఇక చాలు.. పోయి బెంచ్‌పై కుర్చో.. ఇదేం ఐపీఎల్ కాదు..!
ఇంగ్లండ్‌పై జరిగిన సెమీస్ ఫైట్‌లోనూ కోహ్లీ అట్టర్‌ఫ్లాప్ అయ్యాడు. 9 బంతుల్లో 9 పరుగులే చేశాడు. ఈ టీ20 WCలో కోహ్లీ 10.71 సగటుతో 100 స్టైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ తీవ్రంగా నిరాశపరిచాడు. సెమీస్ వరకు ఇప్పటివరకు 7 ఇన్నింగ్స్‌లలో కేవలం 75 పరుగులు మాత్రమే చేశాడు కోహ్లీ.
Translate this News: