బేబీ బంప్ తో అనుష్క శర్మ..నెట్టింట్లో వీడియో వైరల్.!

విరాట్, అనుష్క వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అనుష్క మరోసారి ప్రెగ్నెంట్ అంటూ హడావుడి చేస్తున్నారు. అయితే, వీరిద్దరూ మాత్రం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.

New Update
బేబీ బంప్ తో అనుష్క శర్మ..నెట్టింట్లో వీడియో వైరల్.!

Anushka Sharma's Baby Bump: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli), బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ  2017లో  ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి 2021 జనవరిలో ఓ కూతురు పుట్టింది. ఆ కూతురి పేరు వామిక (Vamika). అయితే, గత నెలలో విరాట్ కోహ్లీ, అనుష్క (Anushka Sharma) దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారనే వార్తలు వైరల్ అయింది.కానీ, వీరిద్దరూ ఈ వార్తపై ఏ మాత్రం స్పందించలేదు.

Also Read: “తగ్గేదే లేదు బిడ్డ”.. బిగ్ బాస్ ఇంట్లోకి పల్లవి ప్రశాంత్ ఫాదర్..!

publive-image

తాజాగా, విరాట్ అనుష్క వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు వీరిద్దరు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారని అనడానికి ప్రూఫ్ ఇదేనంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కోహ్లీ గురించి ప్రతేక్యంగా చెప్పనవసరం లేదు. క్రికెట్ లో తన సత్తా చాటుతూ దూసుకుపోతున్నాడు. ఇక, అనుష్క శర్మ డిసెంబర్ 2017లో విరాట్ కోహ్లిని పెళ్లి చేసుకున్న తర్వతా సినిమాలకు దూరంగా ఉంటోంది.  2018లో తన చిత్రం జీరో విడుదలైన తర్వాత నటనకు విరామం తీసుకుంది.

publive-image

జనవరి 2021లో కుమార్తె వామికు జన్మనిచ్చిన తర్వాత  అనుష్క నటనకు బ్రేక్ చెప్పింది. అప్పటి నుండి, అనుష్క ఏ సినిమాలోనూ నటించలేదు. అయితే, రిసెంట్ గా ఆమె స్పోర్ట్స్ డ్రామా చక్దా ఎక్స్‌ప్రెస్‌తో రి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.  ఇప్పటికే తన షూటింగ్‌ను పూర్తి చేసిందట. కాగా, సినిమా విడుదల తేదీ మాత్రం ఇప్పటి వరకు తెలియదు.

publive-image

తాజాగా, బెంగుళూరులో విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులకు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి వైరల్ అవుతుంది. భర్త విరాట్ కోహ్లితో కలిసి చేతిలో చేయిలో చేయి వేసుకుని నడుస్తూ కనిపించింది. అయితే, ఆ వీడియోలో అనుష్క బేబీ బంప్ తో కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

publive-image

త్వరలోనే బుల్లి విరాట్ పుడతారంటూ క్రికెట్ అభిమానులు హల్ చల్ చేస్తున్నారు. కాగా, నవంబర్ 12న దీపావళి నాడు జరగనున్న ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ వరల్డ్ కప్ మ్యాచ్ కోసం ఇద్దరూ బెంగళూరులో ఉన్నారని తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు