/rtv/media/media_files/2025/09/15/women-smoking-in-train-2025-09-15-15-48-48.jpg)
women smoking in train
Viral Video: ట్రైన్ కంపార్ట్మెంట్ లో ఓ యువతి సిగరెట్ తాగుతూ హల్ చల్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తోటి ప్రయాణికుడు ట్రైన్ లో స్మోక్ చేయడం ప్రమాదకరమని, రూల్స్ కి విరుద్ధమని, చెప్పినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. ఇక్కడ స్మోక్ చేసి ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవద్దని కోరగా సదరు వ్యక్తిపై రెచ్చిపోయింది. నీ దగ్గర తాగడం లేదు కదా.. నీకెందుకు అన్నట్లుగా మాట్లాడుతూ గొడవకు దిగింది. పోలీస్ కంప్లైంట్ చేస్తామని చెప్పగా.. హా చేస్కోండి అంటూ పొగరుగా ప్రవర్తించింది. తీరా గొడవ పెద్దది కావడంతో టీసీ అక్కడికి రాగానే సింపతీ కోసం ఏడ్చేసింది సదరు యువతి. .
She was smoking cigarettes in an AC compartment of a running train.
— Rishi Bagree (@rishibagree) September 15, 2025
When co-travellers objected and made a video for proof, she started playing the "women's card."
pic.twitter.com/UPYmZCAi1E