Pushpa Raj Ganesha: క్షమించండి..! బుల్లి బన్నీ ఫ్యాన్స్ క్షమాపణలు

శ్రీవల్లితో ఉన్న 'పుష్ప వినాయకుడి' విగ్రహంపై వివాదం కొనసాగుతుండగా ఆ విగ్రహం పెట్టిన పిల్లలు స్పందించారు. ఇలా నెగిటివ్ కామెంట్స్ వస్తాయని ఊహించలేదన్నారు. ఎవరిని అయినా హర్ట్ చేసి ఉంటే సారీ అని చెప్పారు. అయితే తమను బూతులు తిట్టడం కరెక్ట్ కాదని వాపోయారు.

pushpa raj ganesh

Pushpa Raj Ganesha

New Update

Pushpa Raj Ganesha Video Viral : ఇటీవలే సోషల్ మీడియా (Social Media) లో దర్శనమిచ్చిన 'పుష్ప రాజ్' (Pushpa Raj) వినాయకుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. 'పుష్ప రాజ్' లుక్ తో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేయడంతో పాటు ఆయనకు తోడుగా శ్రీవల్లి విగ్రహాన్ని కూడా జోడించారు. దీంతో ఈ వినాయకుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు కొందరు సరదాగా నవ్వుకోగా.. మరికొందరు హీరోల పై అభిమానం ఉంటే పర్వాలేదు.. కానీ ఇలా దేవుడిని అపహాస్యం చేయడం సరైనది కాదని కామెంట్స్ చేశారు. అంతేకాదు ఈ వినాయకుడి పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ కూడా వస్తున్నాయి.  దీనిపై 'పుష్ప రాజ్' విగ్రహాన్ని పెట్టిన పిల్లలు స్పందించారు.

''క్షమించండి''

అయితే ఈ పుష్ప రాజ్ వినాయకుడి (Lord Ganesha) ని ఒక గ్రామానికి చెందిన కొంత మంది చిన్న పిల్లలు కలిసి కొత్తగా, వైరైటీగా ఉంటుంది అనుకోని  ప్లాన్ చేశారు. కానీ దేవుడిని అపహాస్యం చేశారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్, కామెంట్స్ రావడంతో ఆ పిల్లలు స్పందించారు. తాము చేసిన పొరపాటుకు క్షమాపణలు తెలిపారు. "ఏదో తెలియక సరదాగా ఇలా వినాయకుడుని పెట్టుకున్నామని. తాము చేసిన తప్పుకు క్షమించమని కోరారు. కానీ తెలియక చేసిన దానికి ఇలా ట్రోల్స్ చేయడం, బూతులు తిట్టడం ఏమీ బాగోలేదని వాపోయారు బుల్లి అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఇంకోసారి ఇలా చేయము వినాయక అని దేవుడికి క్షమాపణలు చెప్పారు."  ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe