‘ఎలన్ మస్క్ ఏలియన్ అని చెప్పడానికి ఇదే సాక్ష్యం’ (VIRAL VIDEO)

ఎలన్ మస్క్ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భోజనం చేయడానికి కూర్చున్న మస్క్ తన వేలుపై ఓ ఫోర్క్, స్ఫూన్ రెండిటినీ బ్యాలెన్సింగ్ చేశాడు. దానిని చూసిన ఓ నెటిజన్ ఎలన్ మస్క్ ఏలియన్ అని చెప్పడానికి ఇదో రుజువు అని కామెంట్ చేశారు.

New Update
elon musk viral video

elon musk viral video Photograph: (elon musk viral video)

అపర కుభేరుడు ఎక్స్ అధినేత, టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ చేసే పనులు, తీసుకునే నిర్ణయాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నాయి. అమెరికాలో ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఈ తీరు మరీ ఎక్కవైతుంది. తాజా ఎలన్ మస్క్ ట్రంప్‌ ఇచ్చిన పార్టీలో భోజనం చేస్తూ ప్రవర్తించిన తీరు వీడియోలు సోషల్ మీడియాలో వైరత్ అవుతున్నాయి. ఈ వీడియోస్‌పై నెటిజన్లు బాగా స్పందిస్తున్నారు. ఎలన్ మస్క్ భోజనం చేయకుండా ఓ ఫోర్క్‌ను మరో స్ఫూన్‌తో కలిపి తన వేలుపై బ్యాలెన్స్ చేశాడు. ఈ వీడియో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకమైన మార్-ఎ-లాగో క్యాండిల్ లైట్ డిన్నర్ ఇచ్చిన సందర్భంలోనిదని తెలుస్తోంది. 

Also read: BIG BREAKING: చికెన్ తింటే బర్డ్‌ఫ్లూ వస్తుందని.. జాతీయ పక్షి నెమలిని చంపిన వ్యక్తి

ఈ వీడియో ఎక్స్‌లో వైరల్ అవుతుంది. దీన్ని చూసిన కొందరు వారికి తోచిన కామెంట్లు చేస్తున్నారు. మస్క్ మనిషి కాదు ఏలియన్ అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. ఎలన్ మస్క్ తన ఎక్స్ అకౌంట్‌ క్రీ.పూ 3000 ఏళ్ల క్రితం క్రియేట్ చేశాడని పెట్టుకున్నాడు. దాన్ని పోల్చుతూ.. ఓ నెటిజన్ ఎలన్ మస్క్ ఏలియన్ అని చెప్పడానికి ఇదే రుజువు అని అన్నాడు.

Also read: Rajahmundry Event anchor: అక్రమ సంబంధంలో అనుమానం.. తల్లీకూతుళ్లను పొడిచి చంపిన యువకుడు

ఇంత టెక్నికల్‌గా ఆలోచిస్తాడు కాబట్టే అతను ఆ స్థాయిలో ఉన్నాడని మరో యూజర్ మెచ్చుకున్నాడు. ఎలోన్ ఎక్కడికి వెళ్ళినా, ఆ క్షణాన్ని ఆస్వాదించడానికి అతను ఒక మార్గాన్ని వెతుక్కుంటాడని ఓ యువతి కామెంట్ చేసింది. ఎలన్ మస్క్ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని బోర్ కొట్టి ఇలా చేశాడని మరొకరు  అంటున్నారు. ఏదేమైనా ఎలన్ మస్క్ బ్యాలెన్సింగ్ థియరీ మిలియన్ యూజర్లు చూశారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

Advertisment
తాజా కథనాలు