Christopher Columbus: పాతకాలపు వస్తువులు-అవశేషాల గురించి తెలుసుకోడానికి పురాతన తవ్వకాలు దోహదపడతాయి. తాజాగా ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలు.. స్పెయిన్‌లోని సెవిల్లె కేథడ్రల్‌లో లభించిన మానవ అవశేషాలపై 20 ఏళ్లపాటు పరిశోధన చేశారు. ఆ అవశేషాలు ప్రముఖ అన్వేషకుడు క్రిస్టోఫర్ కొలంబస్‌కు చెందినవని తేల్చి చెప్పారు. ఐదు శతాబ్దాల నాటి మిస్టరీని ఛేదించిన ఈ పరిశోధకులు కొలంబస్ సమాధి, జాతీయత వివరాలను ప్రపంచానికి తెలియజేశారు.
సమాధిని తెరిచి పరిశోధన:
ఇది కూడా చవవండి: మలబద్ధకం వేధిస్తుందా.. ఇలా చేశారంటే మంచి ఉపశమనం
క్రిస్టోఫర్ కొలంబస్ అనే వ్యక్తి అమెరికాను తొలిసారిగా కనిపెట్టాడు. 1506లో ఆయన మరణించాడు. ఆయన మృతదేహాన్ని చాలా ప్రాంతాలకు మార్చడంతో...ఆయన్ని ఎక్కడ ఖననం చేశారన్న దానిపై ఆధారాలు లభించలేదు. సెవిల్లే కేథడ్రాల్‌లోని సమాధి ప్రాంతమే.. కొలంబస్‌ను ఖననం చేసిన చోటుగా ప్రాచుర్యం పొందింది. 2003లో ఫోరెన్సిక్ శాస్త్రవేత్త మిగ్యుల్ లోరెంటే, చరిత్రకారుడు మార్షియల్ కాస్ట్రో సమాధిని తెరిచి పరిశోధన చేయడంతో అసలు విషయం బయటపడింది. అడ్వాన్స్‌డ్ ఫోరెన్సిక్ సైన్స్ సహకారంతో వారు పరిశోధన చేసి.. క్రిస్టోఫర్ కొలంబస్ సమాధిని బయటపెట్టారు.
ఇది కూడా చవవండి: గుర్రం కంటే పాము వేగంగా వెళ్లగలదా..?