/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/leapord-1-jpg.webp)
తిరుమల నడకమార్గంలో బంధించిన చిరుతలో ఒకదానిని దట్టమైన అడవిలో వదిలిపెట్టారు అటవీశాఖ. మరో చిరుతను వైజాగ్ ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలకు తరలించారు. లక్షిత పైదాడి చేసిన చిరుతలు ఇవి కాదు అని రిపోర్ట్స్‌లో ఇప్పటికే స్పష్టమైంది. ఆగష్టు 14, ఆగష్టు 17 బోనులో పడ్డ చిరుతలను అటవీశాఖ వదలిలేసింది. ఆగస్ట్ 28న చిక్కిన నాలుగో చిరుత, సెప్టెంబర్ 7వ చిక్కిన ఐదవ చిరుతల రిపోర్ట్స్ రాలేదు. తదుపరి రిపోర్ట్స్ వచ్చే వరకూ తిరుపతి జూలోనే ఈ రెండు చిరుతలు ఉండనున్నాయి.
ఇప్పటివరకు మొత్తం ఐదు:
మూడు నెలల వ్యవధిలో మొత్తం ఐదు చిరుతలను పట్టుకున్నారు అధికారులు. గత జూన్‌లో కౌశిక్ అనే బాలుడు చిరుత చేతికి చిక్కి గాయపడడం.. ఆ తర్వాత ఆగస్టు 11న ఆరేళ్ల చిన్నారి లక్షిత (Lakshitha) చిరుత దాడిలో మృతి చెందడంతో అధికారులు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. వరుస పెట్టి ఘటనలు జరుగుతుండడంతో టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మహారాష్ట్ర నుంచి స్పెషల్‌గా బోనులను తెప్పించింది. వాటిలోనే చిరుతపులులు చిక్కాయి. జూన్ 24న మొదటి చిరుత, ఆగస్ట్ 14న రెండో చిరుత, ఆగస్ట్ 17న మూడో చిరుత చిక్కింది. ఆగస్టు 28న నాలుగో చిరుత చిక్కింది. ఇక ఇవాళ(సెప్టెంబర్ 7) ఐదో చిరుత చిక్కింది.
ఏం జరిగిందంటే?
నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన దినేశ్ కుటుంబం తిరుమల(Tirumala) వెళ్లేందుకు చాలా కాలం నుంచి ప్లాన్ వేసుకుంది. ఆ ప్లాన్‌కి తగ్గట్టుగానే ఎంతో ఆనందంగా.. భక్తిగా తిరుమల బయలుదేరింది. అలిపిరి నడకదారి మార్గంలో తిరుమలకు స్టార్ట్ అయ్యారు. నడుచుకుంటూ వెళ్తుండగా.. సడన్‌గా పాప లక్షిత తమతో లేదన్న విషయాన్ని కుటుంబసభ్యులు గమనించారు. లక్షిత ఎక్కడో తప్పిపోయి ఉంటుందని అంతా భావించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా మిస్సింగ్ కేసే అనుకున్నారు. తల్లిదండ్రులు కూడా పాప కనిపించలేదనే అనుకున్నారు కానీ చిరుత దాడి చేస్తుందని అసలు ఊహించలేకపోయారు. లక్షిత కోసం గాలించడం మొదలుపెట్టిన టీటీడీ (TTD) అటవీ శాఖ, విజిలెన్స్, పోలీసులకు నరసింహస్వామి ఆలయం వద్ద లక్షిత మృతదేహం కనిపించింది. లక్షిత శరీరంపై గాయాలు చూస్తే చిరుత దాడి చేసినట్టు వారికి క్లియర్‌గా అర్థమైపోయింది. వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వగా.. పాపను ఆ స్థితిలో చూసిన తల్లిదండ్రులు బోరునా విలిపించారు. నిన్నమొన్నటి వరకు లక్షిత ముద్దుముద్దు మాటలతో మురిసిపోయిన ఆ కుటుంబసభ్యుల ముఖాల్లో ఇప్పుడు విషాదం తప్ప మరెదీ కనిపించని స్థితి. ఎంతో చలాకీగా ఉండే లక్షితను అలా చూసే సరికి కుటుంబసభ్యులు తట్టుకోలేకపోయారు. ఇక ఈ ఘటన తర్వాత నుంచి టీటీడీపై విమర్శలు పెరగడంతో భక్తుల సేఫ్టీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.
ALSO READ: వినాయక చవితికి ఛత్రపతి శివాజీకి, బాలగంగాధర తిలక్‌కి ఉన్న లింకేంటో తెలుసా?