BJP chief vs Reporter: 'వచ్చి నా పక్కన నిలబడు, నీ ముఖం చూపించు'.. మహిళా రిపోర్టర్‌పై బీజేపీ చీఫ్‌ చిందులు..!

భారతీయ జనతా పార్టీ (BJP) తమిళనాడు అధ్యక్షుడు కె అన్నామలై విలేకరులతో వ్యవహరించిన తీరుపై మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి వైదొలగితే బీజేపీలో కొనసాగుతారా అని ఓ మహిళా విలేకరి అతడిని ప్రశ్నించారు. దీనిపై అన్నామలై స్పందిస్తూ.. 'రండి అక్కా, ఇక్కడి నుంచి వచ్చి మాట్లాడండి. ఇలాంటి ప్రశ్నలు ఎవరు అడుగుతున్నారో తమిళనాడు ప్రజలు చూడాలి' అంటూ వెటకారంగా మాట్లాడారు.

New Update
BJP chief vs Reporter: 'వచ్చి నా పక్కన నిలబడు, నీ ముఖం చూపించు'.. మహిళా రిపోర్టర్‌పై బీజేపీ చీఫ్‌ చిందులు..!

Tamil Nadu BJP chief snaps at reporter: తమిళనాడు బీజేపీ చీఫ్‌ నోటి దురద మరోసారి బయటపడింది. నోటికి వచ్చింది మాట్లాడుతూ నిత్యం వివాదాల్లో ఉండే అన్నామలై మరోసారి చిక్కుల్లో పడ్డాడు. ఓ ప్రశ్న అడిగిన మహిళా విలేకరి పట్ల అన్నామలై(Annamalai) ప్రవర్తించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కాకపోతే బీజేపీలోనే కొనసాగుతారా అని అన్నామలైను ప్రశ్నించగా.. ఆ ప్రశ్న ఎవరు అడిగారో అందరికీ అర్థమయ్యేలా తన పక్కనే నిల్చోవాలని వెటకారంగా మాట్లాడారు. "వచ్చి నా పక్కన నిలబడు. నన్ను అలాంటి ప్రశ్న ఎవరు అడిగారో టీవీ ద్వారా ప్రజలను చూడనివ్వండి. ప్రశ్నలు అడగడానికి ఒక మార్గం ఉంది. ఇంత తెలివైన ప్రశ్న అడిగిన వ్యక్తి ఎవరో ఎనిమిది కోట్ల మంది ప్రజలకు తెలియాలి' అని బీజేపీ నేత వ్యాఖ్యానించారు.


జర్నలిస్టులు ఆగ్రహం:

మహిళా రిపోర్టర్‌ను కెమెరాల ముందు నిలబడమని పదేపదే కోరడంతో తోటి జర్నలిస్టులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 'నేను ఫుల్ టైమ్ పొలిటీషియన్‌ని కాదు. రైతుగా, ఆ తర్వాత రాజకీయ నాయకుడిగా, ఆ తర్వాత బీజేపీలో ఉండటమే తన ఐడెంటిటీ అన్నారు. సరైన పద్ధతిలో ప్రశ్నలు అడగాలని విలేకరికి మాత్రమే తాను సలహా ఇస్తున్నానని అన్నామలై వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. 'మంచి ఉద్దేశంతోనే మీకు సలహా ఇస్తున్నాను సిస్టర్' అని బీజేపీ నేత వ్యాఖ్యానించారు. అన్నామలై చర్యను కోయంబత్తూరు ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండించింది.

ఇది కరెక్ట్ కాదు:
జర్నలిజం నైతికతను బోధించే ముందు అన్నామలై నాయకుడిగా ఉన్న నైతికతను నేర్చుకుని గౌరవప్రదంగా వ్యవహరించాలన్నారు. జర్నలిజం పౌరులకు, ప్రజాజీవితంలో ఉన్నవారికి మధ్య వారధిగా నిలుస్తుందని కోయంబత్తూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఏఆర్ బాబు అన్నారు. తమిళనాడు కాంగ్రెస్‌కు చెందిన లక్ష్మీ రామచంద్రన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. "నేను ఎవరిలోనూ ఇలాంటి అహంకారాన్ని చూడలేదు... జయలలితలోనూ, మోదీలోనూ, షాలోనూ లేదు. మానవాళికి భగవంతుడు ఇచ్చిన వరం అని ఈ మనిషి తనను తానుగా భావిస్తాడు. ఒక మహిళా జర్నలిస్ట్ పట్ల అన్నామలై మాట్లాడినట్లుగా తమిళనాడులో ముఖ్యమంత్రి, ఎడప్పాడి పళనిస్వామి సహా ఏ రాజకీయ నాయకుడైనా మాట్లాడగలరా అని ప్రశ్నించారు. మరోవైపు కీలకమైన 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు పొత్తు కోసం ఇతర రాజకీయ పార్టీలను సంప్రదిస్తున్న బీజేపీకి ఇటివలే గట్టి షాక్‌ తగిలింది. బీజేపీ నేతృత్వంలోని కూటమి నుంచి అన్నాడిఎంకె నిష్క్రమణ పెద్ద షాక్ ఇచ్చినట్టైంది. తాజా పరిణామాలపై హైకమాండ్ అసంతృప్తితో ఉందని, వారిని తిరిగి ఎన్డీయే గూటికి చేర్చుకునేందుకు అన్నాడీఎంకేను సంప్రదిస్తోందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అన్నామలై విషయంలో అన్నాడీఎంకే చాలా గుర్రుగా ఉంది. తమిళనాట దేవుడిగా కోలిచే లీడర్లను అన్నామలై చీప్‌ చేసి మాట్లాడారని అన్నాడీఎంకే మండిపడుతోంది.

ALSO READ: మోదీకి ఝలక్‌.. కులాల లెక్కలు తేల్చేసిన ఆ రాష్ట్ర ప్రభుత్వం.. బీసీలు ఎంతంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు