Viral Video: తోక వంకరే.. రైల్వే ట్రాక్‌పై యూట్యూబర్‌ ఏం చేశాడో చూడండి..!

రైల్వే ట్రాక్‌పై ఓ యూట్యూబర్ క్రాకర్స్ పేల్చుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వ్యూస్‌ కోసం అతను ఇలా చేసినట్లు అర్థమవుతోంది. సదరు వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

New Update
Viral Video: తోక వంకరే.. రైల్వే ట్రాక్‌పై యూట్యూబర్‌ ఏం చేశాడో చూడండి..!

సోషల్‌మీడియా(Social media)లో లైక్స్‌ కోసం ఏది పడితే అది చేస్తుంటారు. యూట్యూబ్‌(Youtube)లో ఫేమ్‌ కోసం కామన్‌సెన్స్‌ను పక్కన పెట్టేస్తారు. బెసిక్‌ సెన్స్‌ ఉండదు.. అసలు ఎందుకు ఇలా ఆలోచిస్తారో అర్థంకాదు. పాపులర్‌ అవ్వాలంటే అడ్డమైన పనులు చేయక్కర్లేదు.. బుర్రపెట్టి పని చేసినా ఫేమ్‌ దానికంతట అదే వస్తుంది. యూట్యూబ్‌ వీడియోలను చిన్నపిల్లలు కూడా చూస్తుంటారు. యూట్యూబ్‌ కొన్నిటిని మానిటైజ్ చేయదు.. ఎందుకో తెలియదు.. చాలాసార్లు సమాజానికి హానితలపెట్టే వీడియోలు కూడా ఈ ఫ్లాట్‌ఫామ్‌లో దర్శనమిస్తుంటాయి. ఇక అలాంటి వీడియోనే సోషల్‌మీడియాలో మరొకటి దర్శనమిచ్చింది.


పాము బిల్లలు కాల్చాడు:
ఈ వీడియోను ఫూలేరా-అజ్మీర్ సెక్షన్‌లోని దంత్రా స్టేషన్‌కు సమీపంలో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. ఒక యూట్యూబర్ రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై బాణాసంచా పేలుస్తూ కనిపించాడు. ఇది దాదాపు అన్ని ప్రముఖ సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫారమ్స్‌లో కనిపిస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లకు చిర్రెత్తుకొచ్చింది. 33 సెకన్ల వీడియో చూసిన సోషల్‌మీడియా యూజర్లు సదరు యూట్యూబర్‌పై మండిపడుతున్నారు. రైల్వే ట్రాక్‌పై పాము బిల్లలను కాల్చాడు. అది కూడా పెద్ద మొత్తంలో ఒకేసారి. వెంటనే క్రాకర్ల నుంచి దట్టమైన, నల్లటి పొగలు అక్కడ వ్యాపించాయి.

అధికారుల యాక్షన్:
ఈ వీడియో వైరల్‌ కావడంతో ప్రయాణికుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన నెటిజన్ల.. రైల్వేశాఖకు ట్యాగ్‌ చేశాడు. ఈ వీడియోను అధికారులు గుర్తించారు. 'స్టుపిడ్ DTX' అనే ఛానెల్‌లో వీడియోను షేర్ చేసిన యష్ అనే యూట్యూబర్‌పై చర్యలు తీసుకున్నారు. అతనిపై FIR బుక్‌ అయ్యింది. నార్త్ వెస్ట్రన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కెప్టెన్ శశి కిరణ్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. యష్‌పై సెక్షన్‌ 145, సెక్షన్ 147 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. యూట్యూబర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవల రైలు ప్రమాదాలు పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రయాణికుల్లో సెఫ్టీపై ఆందోళన ఉండగా.. ఇలాంటి వీడియోలతో వాళ్లు మరింత టెన్షన్ పడే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరూ అరెస్ట్ కాలేదు.. అయితే FIR ప్రకారం రైల్వే ట్రాక్‌కు నష్టం కలిగించినందుకు జరిమానా, శిక్ష విధించాలనే నిబంధన ఉంది. ఇలాంటి వీడియోలు రైల్వే ట్రాక్‌లపై చేయవద్దని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Also Read: నిద్రలేచిన వెంటనే వాటర్ ఎంత తాగాలి..? తాగిన తర్వాత ఏం అవుతుంది?

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు