హహహహహహ.. సోషల్‌మీడియాలో కనిపించే కొన్ని వీడియోలు చూస్తే ఇలా నవ్వకుండా ఉండలేము. నిజానికి భారతీయులు హాస్య ప్రియులు... ఎక్కడ ఫన్ అనిపించినా వాటిని నలుగురితో షేర్ చేస్తుంటారు. సోషల్‌మీడియా మీడియా వచ్చిన తర్వాత ఈ షేరింగ్‌లు ఎక్కువయ్యాయి. డిజిటల్ వరల్డ్ నుంచి మనకు పరిచయం లేని వారితో కూడా వినోదాన్ని పంచుకోచ్చు. ముఖ్యంగా ట్విట్టర్‌లో పెట్టే ఫన్ వీడియోలు నిమిషాల్లో వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియో మీ కోసం..!
అది పాస్ పోర్ట్‌రా బాబు:
ఇండియాన్స్ డబ్బును చాలా పొదువుగా వాడుతుంటారు. పిచ్చి కాగితాలను కూడా మంచిగా యూజ్ చేసుకోగలిగే స్కిల్స్ భారతీయుల్లో కనిపిస్తాయి. వస్తువులను కూడా జాగ్రత్తగా వాడుతుంటారు. అయితే కొన్నిసార్లు తింగరిగా చేస్తుంటారు. అలాంటి తింగరి పనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. డాక్టర్ ప్రశాంత్ నాయిర్ అనే యూజర్ ఈ వీడియోను ట్వీట్ చేశారు.
'ఒక వృద్ధ పెద్దమనిషి తన పాస్‌పోర్ట్ రెన్యూవల్ కోసం సమర్పించాడు. తన ఇంట్లో ఎవరో ఏం చేశారో అతనికి తెలియదు. ఇది చూసిన అధికారి షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు.' అని ట్వీట్ చేశారు.
ఈ ఘటన కేరళలో జరిగినట్లు క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది. కేరళకు చెందిన ఓ వ్యక్తి పాస్ట్‌పార్ట్ రెన్యూవల్‌కు వెళ్లాడు. ముందుగా అందులో ఏం ఉందో చూసుకోలేదు. అక్కడికి వెళ్లిన తర్వాత తన బుక్‌ను ఆఫీసర్‌కు అందించాడు. అది చూసిన ఆఫీసర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. చాలా సేపు అతని నోట్లో మాట రాలేదు. ఆ పాస్‌పోర్ట్‌ని.. ఆ బుక్ తెచ్చినవాడిని అలానే కాసేపు చూశాడు. పాస్‌పోర్ట్ రిటర్న్ ఇచ్చి.. ఇందులో ఏముందో చూసుకోమని చెప్పాడు. ఆ ఏముంటుంది.. ఈ ఆఫీసర్ ఎందుకు ఇలా చూస్తున్నాడు.. అని పాస్‌పోర్ట్ పేజీలు టర్న్ చేశాడు.. అంతే ఒక్కసారిగా ఫ్యూజులు అవుట్ అయ్యాయి. పేజీలు తిప్పుతున్న కొద్దీ అందులో ఫోన్ నంబర్లు కనిపించాయి. ఆ నంబర్లన్ని తనకు తెలిసినవాళ్లవే. ఇంట్లో ఎవరో పాస్‌పోర్ట్ బుక్‌లో నంబర్లు రాసినట్లు అర్థమైంది. ఫోన్ నంబర్లన్ని రాసిన తర్వాత లాస్ట్‌లో ఏదో సరుకులకు సంబంధించి లెక్కలు కూడా వేశారు. ఎడిషన్స్, మల్టిప్లికేషన్స్‌తో ఆ బుక్ మ్యాథ్య్ నోట్స్‌లా కనిపించింది. మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది కాబోలు అనుకుంటూ ఇంటికి వెళ్లిపోయాడు.
Also Read: పిల్లాడు తింటున్న ప్లేటును లాక్కెళ్లిన వెయిటర్.. చివరికి ఏం చేశాడంటే..? - Rtvlive.com