Viral Video : దేశంలో నిరుద్యోగ సమస్య(Un-Employment) ఏ విధంగా ఉందో ఈ ఒక్క వీడియో చూస్తే తెలుస్తుంది. తమ చదువుకు తగిన ఉద్యోగం కాకపోయినప్పటికీ ఎలాగైనా సాధించాలన్న పట్టుదలతో సుమారు 3 వేల మంది యువకులు గంటల తరబడి క్యూలో నిల్చున్న ఘటన పూణెలో చోటు చేసుకుంది.
పూణెలోని ఓ కంపెనీ వాక్ ఇన్ ఇంటర్వ్యూలను(Walk In Interview) నిర్వహించింది. తమ కంపెనీ కోసం డెవలపర్ స్థానాలను భర్తీ చేసుకునేందుకు ప్రెషర్స్ నుంచి రెస్యూమ్ లకు ఆహ్వానం పలికింది. అయితే కంపెనీలో కేవలం 100 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇవ్వగా..ఆ ఉద్యోగాల కోసం సుమారు 3 వేల మంది అప్లైయ్ చేసుకున్నారు.
ఇంటర్వ్యూలో పాల్గొనేందుకు సుమారు 3 వేల మంది నిరుద్యోగ యువకులు కంపెనీ గేటు బయట తమ రెస్యూమ్ లను పట్టుకుని నిల్చుని ఉన్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media) లో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఐటీ ఉద్యోగం కోసం యువ ఇంజనీర్లు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి తెలుపుతుంది.
కేవలం 100 ఉద్యోగాల కోసం...
పూణె(Pune) లో ఎన్నో ఐటీ కంపెనీలు(IT Companies) ఉన్నాయి. కానీ కేవలం 100 ఉద్యోగాల కోసం ఇలా నిరుద్యోగ యువత గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండడం దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్య ఏ విధంగా ఉందో తెలుపుతుంది. ఈ సంఘటన ఇటీవలి గ్రాడ్యుయేట్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను , వారి మధ్య ఉన్న పోటీని హైలెట్ చేస్తుంది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొందరు నెటిజన్లు దీని గురించి స్పందించారు."ఒక IT కంపెనీ అనలాగ్ పద్ధతిలో CVలను సేకరించడం వ్యంగ్యం యొక్క ఎత్తు" అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. మరొక నెటిజన్ అయితే "ఈ క్యూ చెడ్డదని మీరు భావిస్తే, కెనడియన్ కిరాణా దుకాణంలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నించండి; వారి లైన్లు దీని కంటే పొడవుగా ఉన్నాయి."
మరో నెటిజన్ అయితే "నీ ఇంజనీరింగ్ పూర్తి చేయమని చెప్పిన మామయ్య ఎక్కడ ఉన్నాడు, ఆ తర్వాత అంతా బాగానే ఉంటుంది?" అంటూ రాసుకొచ్చారు.
Also read: మీ పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరగాలా..అయితే ఈ 5 సూపర్ ఫుడ్ ని తినిపించండి!