/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/noida-pet-jpg.webp)
చాలా అపార్ట్‌మెంట్లలో, గేటెడ్ కమ్యూనిటీల్లో పెట్ డాగ్స్‌కు లిఫ్ట్‌లో అనుమతి ఉండదు. పెంపుడు కుక్కలకు అనుమతి లేదు అని నోటీస్ బోర్డు కూడా పెట్టి ఉంటుంది. అటు పెంపుడు కుక్కలను పెంచుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వాటిని చాలా ప్రేమగా పెంచుకుంటారు. తమతో పాటే తీసుకెళ్తారు. మార్నింగ్ వాక్, ఈవెనింగ్ వాక్‌కు తమ పెట్ డాగ్స్‌ను కూడా వెళ్తాయి. రిటర్న్ అపార్ట్‌మెంట్ లేదా కమ్యూనిటీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు లిఫ్ట్ ఎక్కాల్సి ఉంటుంది. ఎందుకంటే సిటీల్లోని చాలా అపార్ట్‌మెంట్లు 5ఫోర్లు మినిమం ఉంటాయి. అంతసేపు ఎక్సర్‌సైజ్ చేసి వచ్చి మళ్లీ మెట్లు ఎక్కాలంటే కష్టమవుతుంది. అందుకే లిఫ్ట్ ఎక్కుతారు. అదే సమయంలో తమ పెంపుడు కుక్కను కూడా లిఫ్ట్ ఎక్కిస్తారు. ఇది కొన్ని చోట్ల అపార్ట్‌మెంట్ రూల్స్‌కి విరుద్ధం. అందుకే పెండుడు జంతువుల యజమానులతో నిత్యం ఎక్కడో అక్కడో వేరేవారికి గొడవలు అవుతాయి. అలాంటి ఘటనే యూపీలో జరిగింది.
వాగ్వాదం.. ఆ పై తన్నులాట:
లిఫ్ట్‌లో ఆంటీ అంకుల్..పొట్టు పొట్టు కొట్టుకున్నారు. చెంపలు చెళ్లుమనిపించుకున్నారు. అది కూడా ఓ కుక్క కోసం. లిఫ్ట్‌లోనే పిడిగుద్దులు గుద్దుకున్నారు. సీన్ కట్ చేస్తే మహిళ భర్త ఎంట్రీ ఇచ్చాడు. భార్యపై చేయి చేసుకున్నాడన్న కోపంతో వీరబాదుడు బాదుడు. నోయిడా(Noida)లో జరిగిన ఈ ఘటన చూసి షాకయ్యారు స్థానికులు.
అసలేం జరిగింది?
ఓ మహిళ తమ పెంపుడు కుక్కను లిఫ్ట్‌లో తీసుకెళ్తోంది. ఐతే దాన్ని అడ్డుకున్నారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. పెంపుడు కుక్కను తీసుకెళ్తున్న వీడియో తీసేందుకు యత్నించిన మాజీ ఐఏఎస్‌పై అటాక్ చేసింది ఆ మహిళ. దీంతో ఆమెపై దాడి చేశారాయన. మధ్యలో మరో మహిళ ఎంట్రీ ఇచ్చింది. ఇంకేముంది. అంతా కలిసి రచ్చ రచ్చ చేశారు. ఇక కాసేపటికి ఆ మహిళ భర్త సీన్‌లోకి ఎంటరయ్యాడు. రిటైర్డ్ ఐఏఎస్‌ను వీరబాదుడు బాదాడు. స్థానికులు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఇక గొడవ గురించి తెలుసుకున్న పోలీసులు ఆ అపార్ట్‌మెంట్‌కు వెళ్లి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఇరు వర్గాల స్టేట్‌మెంట్స్ తీసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ కుక్క కోసం ఇంత గొడవా అంటూ షాకవుతున్నారు.
Also Read: బుమ్రాతో పోలికా? సొంత జట్టు ఫ్యాన్స్‌కు ఇచ్చిపడేసిన పాకిస్థాన్ లెజెండ్!