Viral Video: కోడికి ఇలా కూడా తినిపిస్తారా 🙄😳? అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్ భయ్యా!

ఫేస్‌బుక్‌లో ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంట్లో పురుగుల బాధను తట్టుకోలేక ఒక వ్యక్తి కోడితో వాటిని తినేలా చేశాడు. ఒక కర్రపై కోడిని నిలబెట్టి ఇలా చేశాడు.

Viral Video: కోడికి ఇలా కూడా తినిపిస్తారా 🙄😳? అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్ భయ్యా!
New Update

సీతాకాలమైనా వర్షం కురిసింది.. ఇల్లు మరికాస్త చల్ల పడింది.. సాయంత్రం వేడివేడి భజ్జిలు తిని .. రాత్రికి బిర్యానీ తిని దుప్పటేసుకోని నిద్రపోదం అని ఊహాలోకంలో విహరిస్తున్నారు ప్రజలు. దేశవ్యాప్తంగా పలు చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. అయితే సాయంత్రం అవ్వగానే భజ్జిలైతే తింటున్నారు కానీ.. ఇంట్లో కూర్చొలేని దుస్థితి దాపరించింది. బయట ఉండాల్సిన పురుగులు ఇంట్లోకి వస్తున్నాయి. డోర్లు వేసినా ఏదో ఒక హోల్‌లో నుంచి దూరి వస్తున్నాయి. చాలా మంది ఇళ్లలకి తెరలు ఉండవు. దీంతో పురుగులు మధ్య గడపాల్సి వస్తోంది. లైట్‌ లేకపోతే పని జరగదు. వంట కూడా అవ్వదు.. పురుగుల మధ్య భోజనం చేస్తే నోట్లోకి ఏం వెళ్తుందో తెలియదు.. తలచుకుంటూనే అదోలా అనిపిస్తుంది. ఇదే విషయంలో ఒక వ్యక్తికి తీవ్ర ఇబ్బంది అనిపించింది. లైట్స్‌ ఆఫ్ చేయకుండా పురుగులు బెడదని ఎలా వదిలించుకోవాలా అని బ్రెయిన్‌కు పదును పెట్టాడు. ఈలోపే బయట నుంచి 'కొక్కొరొక్కో' అని సౌండ్‌ వినిపించింది. వెంటనే మనోడి బుర్రకు లైట్‌ వెలిగింది.

ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్ అసలు:
కూసింది తన కోడే.. ఆకలేసి కూసిందో.. ఉపాయం తానేనని కూసిందో తెలియదు కానీ.. మనోడికి మాత్రం దిమ్మదిరిగే ఐడియా వచ్చింది. రోజూ తన కోడి ఎరుకొని పురుగులను తింటుంటుంది. కొన్నిసార్లు జీడిపప్పు, బాదం లాంటివి ఇంట్లో వాళ్లు పెడుతుంటారు. ఎలాగో నైట్‌ అయ్యింది కదా.. కోడికి ఫుల్‌ మీల్స్‌ పెడదాం అని డిసైడ్ అయ్యాడు. ఒక పెద్ద కర్ర తీసుకొచ్చాడు.. ఈ కర్ర ఎడ్జ్‌లో ఒక కోడి పట్టేంత చిన్నచిన్న స్టిక్స్‌ ఉన్నాయి. కోడిని ఆ కర్ర మీదకు తీసుకొచ్చాడు. కోడి నిలబడి ఉన్న ఉన్న కర్రను తన రూమ్‌ లైట్‌ వరకు తీసుకెళ్లాడు. దీంతో అక్కడపైన గోడకున్న పురుగులను కోడి తినడం మొదలుపెట్టింది. కోడి తమను తినేస్తుందన్న భయంతో మిగిలిన పురుగులు కొన్ని పారిపోయాయి. మరికొన్ని మాత్రం ఈ కోడిగాడితో తేల్చుకుందాం అని అక్కడే ఉండిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో ఫేస్‌బుక్‌లో వైరల్‌గా మారింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. గుడ్‌ ఐడియా అని కొంతమంది కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరేమో ఇంత కష్టపడే బదులు లైట్స్‌ ఆఫ్ చేస్తే సరిపోతుంది కదా అని చెబుతున్నారు. ఆ దోమలు టార్చర్‌ తట్టుకోలేక వాడి బుర్ర బాగా షార్ప్‌ అయిందని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: సినిమా థియేటర్ లో టపాసులు పేల్చిన ఫ్యాన్స్.. RGVకే చికాకు పెట్టించారు కద బ్రో..!

WATCH:

#viral-video
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe