Viral Video: రోడ్డుపై గేదె ఉగ్రరూపం.. అతడిని ఈడ్చితన్నిన బఫెలో.. తర్వాత ఏం జరిగిందంటే?

రోడ్డుపై ఒంటరిగా నిలిబడి ఉన్న ఓ గేదె ఉన్నట్టుండి రెచ్చిపోయింది. ఎదురుగా వస్తున్న ఓ బైకర్‌పై దాడి చేసింది. అతడిని కుమ్మిపడేసింది. బాధితుడిని రక్షించేందుకు వచ్చిన వారిపై కూడా గేదె అటాక్ చేసింది. ఈ వీడియో చాలా భయానకంగా ఉంది.

Viral Video: రోడ్డుపై గేదె ఉగ్రరూపం.. అతడిని ఈడ్చితన్నిన బఫెలో.. తర్వాత ఏం జరిగిందంటే?
New Update

Buffalo Attacks Biker: సోషల్‌మీడియాలో అనేక వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. ముఖ్యంగా యనిమల్స్‌కు సంబంధించిన వీడియోలు బాగా వైరల్‌ అవుతుంటాయి. జంతువులు చేసే చిలిపి పనులతో పాటు అవి ఆడే ఆటలను కూడా కొంతమంది వీడియోలు తీసి పెడుతుంటారు. అయితే వైరలైన ప్రతి వీడియో పాజిటివ్‌ వీడియోనే అవ్వాలని లేదు. కొన్ని వీడియోల్లో యనిమల్స్‌ బీభత్సం సృష్టిస్తాయి. మరి కొన్ని వీడియోల్లో మనుషులపై దాడి చేస్తాయి. అలాంటి ఓ వీడియోనే సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.



ఇకపై దూరంగా ఉంటేనే బెటర్:

ప్రశాంతంగా కనిపించే గేదె ఈ వీడియోలో భీకర రూపంలో కనిపించింది. నిజానికి ఆవులు, గేదెలు, ఎద్దులు వీధుల్లో తిరగడం సర్వసాధారణం. మనుషులు, వాహనదారులు సైతం వీటిని పెద్దగా పట్టించుకోకుండానే తమ పని తాము చేసుకుంటుపోతారు. అయితే ఈ వీడియో చూస్తే మాత్రం ఇకపై జాగ్రత్త పడతారు. ఎందుకంటే ఈ వీడియో చాలా భయానకంగా ఉంది. గేదె ఇంత దురుసుగా, దూకుడుగా ఉంటుందా అని వీడియో చూసిన వాళ్లు ఆశ్చర్యపోతున్నారు.

ఓ గేదె రోడ్డుపై ఒంటరిగా నిలబడి ఉంది. అకస్మాత్తుగా ఒక బైక్ రైడర్‌ను చూసి అతన్ని చంపడానికి పరుగెత్తింది. క్షణంలో అతడిని ఎత్తుకుని బైక్‌తో పాటు విసిరేసింది. రక్షించేందుకు వచ్చిన వారిపై కూడా గేదె దాడి చేసింది.

Also Read: అర్థరాత్రి ట్రాక్ పై ట్రక్ బోల్తా.. ప్రాణాలు అడ్డుపెట్టి కొన్ని వందల ప్రాణాలు కాపాడిన వృద్ద దంపతులు!

#viral-video #buffalo
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe