Viral Vedio: సోషల్ మీడియా ప్రాభవం పెరిగిపోయింది. దీంతో తాము ప్రత్యేకంగా గుర్తింపు పొందాలనీ.. సోషల్ మీడియాలో టాప్ లో నిలవాలని తాపత్రయ పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా యువత ఈ సోషల్ మీడియా క్రేజ్ వెనుక పరుగులు తీయడం ఎక్కువగా కనిపిస్తోంది. తాము ప్రపంచం దృష్టిలో పడాలనీ.. ప్రత్యేకంగా నిలవాలనీ యువకులు ఎంచుకుంటున్న మార్గం ప్రమాదకరమైన స్టంట్స్. కేవలం కొన్ని లైక్‌లు, రీచ్ కోసమే చాలామంది తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. దాని పర్యవసానాలను వారు తరువాత అనుభవించవలసి ఉంటుంది. ఈ రోజుల్లో అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
ప్రతి సంవత్సరం చాలా మంది యువత రోడ్లపై విన్యాసాలు చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ ఆలోచించకుండా విన్యాసాలు చేయడం తప్పు అని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు యువత సినిమాలను చూసి తమను తాము హీరోలుగా అనుకోవడం.. హీరోల్లా తాము రకరకాల విన్యాసాలు చేయడం చాలా సహజంగా మారిపోయింది. అయితే, దీనివలన వారు ప్రమాదాల బారిన పడటం కూడా అంతే సాధారణంగా మారిపోయింది. ఈ వీడియో చూడండి..
ఇందులో ఒక యువకుడు బైక్‌పై విన్యాసాలు చేస్తున్నాడు. అదీ ఒక కాలు పై బైక్ పై నుంచిని.. బైక్ ముందు టైర్ గాల్లోకి లేపి.. మరో కారు పక్కన ఉన్న ఒక కారుపై పెట్టి.. బైక్.. కారు సమాంతరంగా కదులుతుండగా ఫీట్స్ చేస్తున్నాడు. కొంత సేపు అంతా సజావుగా జరిగింది. దీనిని పక్కన వేరే వాహనం మీద వెళుతున్నవారు వీడియో తీస్తున్నట్టున్నారు. కొద్దీ సేపటి తరువాత బైక్ మీద ఉన్న వ్యక్తి బ్యాలెన్స్ తప్పాడు. దీంతో బైక్ ఒక పక్కకి.. అతను మరో పక్కకి పడిపోయారు.
Also Read: మెట్రోలో కొట్టుకున్న యువతులు.. వీడియో వైరల్!
ఈ వీడియో ఎక్కడ.. ఎప్పుడు తీశారో వివరాలు తెలియరాలేదు కానీ, ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్ లో ఒక యూజర్ షేర్ చేశాడు. దీనిని చాలామంది చూశారు. దాదాపుగా 50 వేల మంది పైగా లైక్స్ కొట్టారు. ఇక ఈ వీడియోపై కామెంట్స్ కూడా చాలా ఎక్కువగా వచ్చాయి. ఇంతకీ పడిపోయిన వ్యక్తి బతికున్నాడా? లేదా? అంటూ చాలామంది యూజర్లు ప్రశ్నించారు. అలాంటి ప్రమాదకర ఫీట్స్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియోలో ఫీట్స్ చేస్తున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోకపోవడం పై కూడా చాలామంది స్పందించారు. కనీసం హెల్మెట్ కూడా పెట్టుకోకపోతే ఎలా అంటూ కామెంట్స్ చేశారు. మొత్తమ్మీద ఈ వీడియో చూస్తే.. సోషల్ మీడియా ప్రాభవంతో చేస్తున్న ఫీట్లు ప్రాణాంతకం ఎలా అవుతాయో స్పష్టం చేస్తోంది.