Viral News: షాకింగ్ వీడియో.. ఒకే రన్‌వే పై 2 విమానాలు!

ఒకే రన్ వేపై రెండు విమానాలు వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇలాంటి ఘటనే ముంబై విమానాశ్రయంలో శనివారం చోటు చేసుకుంది. ఇండోర్‌ నుంచి వచ్చిన ఇండిగో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలోనే అదే రన్ వే పై ఎయిర్ మరో విమానం టేకాఫ్ కావడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు.

Viral News: షాకింగ్ వీడియో.. ఒకే రన్‌వే పై 2 విమానాలు!
New Update

Mumbai Airport: ముంబై విమానాశ్రయంలో శనివారం ఓ ఘోర ప్రమాదం తప్పింది. ఇండోర్‌ నుంచి వచ్చిన ఇండిగో విమానం ల్యాండ్ అవుతుండగా.. అదే రన్ వేపై ఎయిర్ ఇండియా విమానం తిరువనంతపురం వెళ్లేందుకు టేకాఫ్ కావడం టెన్షన్ పుట్టించింది. ఈ రెండు విమానాల మధ్య కొన్ని వందల మీటర్ల దూరమే ఉండడంతో అంతా షాక్ కు గురయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందిని విధుల నుంచి తప్పించినట్లు వెల్లడించారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe