ఆస్పత్రికి రోగుల తాకిడి
నిజామాబాద్ జిల్లాలో వైరల్ ఫీవర్ విజృంభణతో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగింది. వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతుండటంతో సీజనల్ వ్యాధులు పెరిగిపోతున్నాయి. రోగాల బారిన పడుతున్న బాధితులంతా ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ప్రభుత్వాస్పత్రితోపాటు ప్రైవేట్‌లోనూ రద్దీ నెలకొంది. ఈ జ్వరాల బారినపడే వారి సంఖ్య పెరిగింది. వైరల్ ఫీవర్స్‌తో రోగులు సతమతమవుతున్నారు.
ఈ ఫీవర్‌లో మలేరియా కొంత అదుపులో ఉన్నప్పటికీ డెంగ్యూ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రోజువారీగా ఆస్పత్రికి వచ్చే రోగుల తాకిడి రెట్టింపైంది. నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో జ్వరాలతో చికిత్స పొందిన వారి సంఖ్య రెట్టింపైంది.1500లకుపైగా ఓపీ పేషంట్స్ జ్వరాలతో ఆస్పత్రికి వచ్చారు. రోజు 200 మంది వారిగా ఇన్ పేషేంట్స్ ఆస్పత్రిలో జాయినింగ్ అవుతున్నారు.
జాగ్రత్తలు ముఖ్యం
డెంగ్యూ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉన్నాయని డాక్టర్లు అంటున్నారు. కనీసం రోజుకు రెండు నుంచి మూడు కేసులు నమోదవుతున్నాయని ఆస్పత్రి అధికారులు చెబుతున్నారు. జాగ్రత్తలు పాటించడం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నగరపాలక సంస్థ అధికారులు ఫాగింగ్‌చేయించి పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ప్రజలు కోరుతున్నారు. దోమల వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎక్కువగా పరిశుభ్రంగా ఉండాలి
అంతేకాకుండా ఈ విష జ్వరాలు ఎక్కువగా రాకుండా వేడి నీళ్లు తాగటం.. వేడి ఆహారం తినడం..పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి వాటిపై చర్యలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. పాము కాటుకి గురికాకుండా గట్టి షూ వేసుకుంటే విషం అనేది కొంచెం ఎక్కకుండా సహాయపడుతుందని నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్.