దమ్ముంటే నాపై పోటీ చేసి గెలువు.. లోకేష్ కు వైసీపీ ఎమ్మెల్యే సవాల్!

ప్రజలకు తాగు నీరు పేరుతో కోట్ల రూపాయలు ట్యాంకర్లకు ఖర్చు పెట్టామని అబద్దాలు చెబుతోన్న లోకేష్.. దొచుకున్న లెక్కల వివరాలను బయట పెట్టాలన్నారు ఎమ్మెల్యే బొల్లా. అడ్డదారిలో ముఖ్యమంత్రిగా, మంత్రిగా అవతరించిన చంద్రబాబు, లోకేష్ లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని తీవ్రంగా మండిపడ్డారు. అమరావతిని రాజధానిని చేస్తానని చెప్పి గ్రాఫిక్స్ చూపించారని.. కానీ చివరికి చేతులెత్తేశారని విమర్శించారు. వినుకొండ ప్రజలకు తాగునీరు ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ఎమ్మెల్యే నిలదీశారు..

New Update
దమ్ముంటే నాపై పోటీ చేసి గెలువు.. లోకేష్ కు వైసీపీ ఎమ్మెల్యే సవాల్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటును పుట్టిస్తున్నాయి. వైసీపీని ఎలాగైనా గద్దె దించాలని టీడీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు వైసీపీ కూడా ఎలాగైనా ఈసారి మళ్లీ అధికారంలోకి రావాలని శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే మాటలకు పదును పెడుతున్నారు. దీంతో మాటల యుద్ధం కొనసాగుతోంది. యువగళం పాదయాత్ర పేరుతో ముందుకెళ్తున్నా లోకేష్.. ఆదివారం వినుకొండలో పర్యటించారు. ఈక్రమంలో స్థానిక ప్రజలు సమస్యలను తెలుసుకోవడంతో పాటు.. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బొల్లా తీవ్రంగా స్పందించారు.

ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత నారా లోకేష్ కు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సవాల్ విసిరారు. తాజాగా మీడియాతో మాట్లాడిని ఆయన .. నారా లోకేష్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. యువ గళం పాదయాత్ర పేరుతో లోకేష్ అబద్దాలు చెబుతున్నాడని దుయ్యబట్టారు. యుతను రెచ్చగొట్టేలా ప్రసంగాలను చేస్తూ.. యువతను పోలీసు కేసుల్లో ఇరికిస్తున్నాడని ఆరోపించారు. దమ్ముంటే వినుకొండలో నాపై పోటీ చేసి గెలుపొందాలని ఎమ్మెల్యే బొల్లా ఛాలెంజ్ చేశారు.

లోకేష్ మంత్రి ఉన్న సమయంలో రూ.2400 కోట్లతో వినుకొండను అభివృద్ధి చేశామని చెప్తున్నాడని.. ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలో చెప్పాలని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు డిమాండ్ చేశారు. అందులో పవన్ కళ్యాణ్ వాటాలో ఎంతో కూడా ప్రజలకు చెప్పాలని విమర్శించారు. ఏది పడితే అది పిచ్చి పిచ్చిగా మాట్లాడితే.. ఊరుకునే ప్రసక్తే లేదని ఫైర్ అయ్యారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లు కలిసి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఎన్ని చెప్పినా.. ఏం చేసినా.. వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు.

ప్రజలకు తాగు నీరు పేరుతో కోట్ల రూపాయలు ట్యాంకర్లకు ఖర్చు పెట్టామని అబద్దాలు చెబుతోన్న లోకేష్.. దొచుకున్న లెక్కల వివరాలను బయట పెట్టాలన్నారు ఎమ్మెల్యే బొల్లా. అడ్డదారిలో ముఖ్యమంత్రిగా, మంత్రిగా అవతరించిన చంద్రబాబు, లోకేష్ లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని తీవ్రంగా మండిపడ్డారు. అమరావతిని రాజధానిని చేస్తానని చెప్పి గ్రాఫిక్స్ చూపించారని.. కానీ చివరికి చేతులెత్తేశారని విమర్శించారు. వినుకొండ ప్రజలకు తాగునీరు ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ఎమ్మెల్యే నిలదీశారు. ఇక్కడికి వచ్చి మాపై ఆరోపణలు చేయడం కాదు.. దమ్ముంటే నాపై ఇక్కడ పోటీ చేసి గెలవాలని అన్నారు.

అలాగే ఒక్కడ మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు తన కుటుంబ సభ్యుల బినామీల పేరుతో వినుకొండ ప్రాంతంలో వందల ఎకరాలు ఆక్రమించారన్నారు. వినుకొండ సమీపంలో సర్వే నంబరు 251, 253 ,249 నెంబర్లలో ఎన్ఎస్పీ పంటకాల్వను ఆక్రమించి గెస్ట్ హౌస్ నిర్మించారని ఆరోపణలు చేశారు. మాజీ ఎమ్మెల్యే జీవీ అక్రమాలపై విచారణ చేయిస్తామని పేర్కొన్నారు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు.

Advertisment
తాజా కథనాలు