BCCI: టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఎన్నికైన విషయం తెలిసిందే. కాగా ద్రవిడ్‌తోపాటు సహాయక సిబ్బంది పదవీకాలం కూడా ముగియడంతో కోచింగ్ స్టాఫ్‌లోకి ఎవరిని తీసుకోవాలనే అంశంపై గంభీర్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు సహాయ కోచ్‌గా పనిచేస్తున్న ముంబై మాజీ ఆటగాడు అభిషేక్ నాయర్‌ను తీసుకోవాలని గంభీర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బౌలింగ్ కోచ్‌గా భారత, ఆర్సీబీ మాజీ పేసర్ ఆర్.వినయ్ కుమార్ పేరును పరిగణలోకి తీసుకున్నట్లు సన్నిహిత వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే మరోవైపు బీసీసీఐ బౌలింగ్ కోచ్ లిస్ట్‌లో టీమ్‌ఇండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ పేరు ఉన్నట్లు సమాచారం. కాగా వీరిద్దరిలో ఎవరిని ఎంపిక చేస్తారు? లేదా మరొకరిని తీసుకుంటారా? అనేది క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఇక వినయ్ కుమార్ ఆర్సీబీ తరఫున 2008-2010, 2012-2013 వరకూ ఐదు సీజన్లు ప్రతినిథ‌్యం వహించాడు. బెంగళూరు తరఫున 70 మ్యాచ్‌లు ఆడి 80 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 2014, 2018 సీజన్లలో కేకేఆర్ తరఫున ఆడాడు. 2014 సీజన్‌లో గంభీర్ సారథ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.