అనంతగిరి కొండల్లో జోరుగా కార్‌, బైక్‌ రేసింగ్‌లు.. దుమ్ము రేపారుగా

వికారాబాద్‌లో రేసింగ్‌ల రచ్చ చేస్తున్నారు. అనంతగిరి కొండల్లో జోరుగా కార్‌, బైక్‌ రేసింగ్‌లతో దుమ్ము రేపుతున్నారు రేసింగ్‌ రాయుళ్లు. అడవుల్లోకి వాహనాలకు అనుమతి లేకున్నా ..డబ్బులు తీసుకొని అటవీశాఖ అధికారులే వదిలేశారని ఆరోపణ చేస్తున్నారు. రేసింగ్‌లతో స్థానికులు భయబ్రాంతులకు గురి అవుతున్నారు. చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

అనంతగిరి కొండల్లో జోరుగా కార్‌, బైక్‌ రేసింగ్‌లు.. దుమ్ము రేపారుగా
New Update

వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల్లో జోరుగా కార్ రేసింగ్ జరుగుతోంది. నిన్న (అగస్టు 15)న సెలవు రోజు కావడంతో అనంతగిరి కొండలకు భారీగా వెళ్లిన యువతీ, యువకులు కార్ల రేసింగ్ నిర్వహించారు. సైరన్‌ వేసుకుంటూ దూసుకువచ్చి విన్యాసాలు నిర్వహించి ఫుల్‌ హంగామా చేశారు. బైక్‌లతో స్టంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలకు తీసి మరి పలువురు వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. అయితే అనంతగిరి కొండల్లో కార్ల రేసింగ్‌ నిర్వహించడంపై స్థానికులు, అధికారులు మండిపడుతున్నారు.

అయితే వీకెండ్స్‌లో హైదరాబాద్‌ నుంచి వస్తున్న కొందరు అనంతగిరి కొండల్లో కార్ల రేసింగ్‌ నిర్వహిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. కార్ల రేసింగ్‌ను అరికట్టాలని స్థానికులు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కార్ల రేసింగ్‌తో పర్యాటకులకు కూడా చాలా ఇబ్బంది కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నిన్న స్వాతంత్ర్య వేడుకల్లో నిమగ్నమైన అధికారులు ఉంటే.. అదే అదనుగా భావించిన రేసింగ్‌ రాయుళ్లు రెచ్చిపోయ్యారు. ఈ రేసింగ్‌ల వల్ల పచ్చటి అడివి నాశనమవుతున్న వారి పట్టనట్టు వారు ఎంజాయ్‌ చేస్తున్నారు. పైన వారిని అటవీ శాఖ అధికారులే డబ్బులు తీసుకొని వదిలేశారని ఆరోపణ చేస్తున్నారు.

#vikarabad #loud-car-and-bike-racing #anantgiri-hills
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe