Sujana Chowdary: కేశినేని నాని లాగా నేను దిగజారలేదు.. లూజ్‌ కామెంట్స్‌ అంటూ సుజనా ఫైర్!

కేశినేని నాని మీద సానుభూతి పడాల్సిందేనని చురకలంటించారు విజయవాడ బీజేపీ వెస్ట్‌ అభ్యర్థి సుజనా చౌదరి. కేశినేని నాని స్థాయికి తాను దిగజారలేనని చెప్పారు. ఇంత త్వరగా కేశినేని నాని దిగజారిపోతారని అనుకోలేదన్నారు సుజన. కేశినేని నాని లూజ్ కామెంట్స్ చేస్తున్నారని విమర్శించారు.

New Update
Sujana Chowdary: కేశినేని నాని లాగా నేను దిగజారలేదు.. లూజ్‌ కామెంట్స్‌ అంటూ సుజనా ఫైర్!

Sujana Chowdary Comments On Kesineni Nani: దేశాన్ని వికసిత్ భారత్‌గా మోదీ మార్చారన్నారు విజయవాడ బీజేపీ వెస్ట్‌ అభ్యర్థి సుజనా చౌదరి. గతంలో టీడీపీలో ఉన్న సుజనా 2019 ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ (BJP) కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఇక ఆయన ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటున్నారు. 33శాతం రిజర్వేషన్ కారణంగా మహిళలు రాజకీయాల్లోకి ఎక్కువగా వచ్చారన్నారు సుజనా చౌదరి. 90శాతం పైగా గ్రామాలకు ఇప్పుడు రోడ్డు కనెక్టివిటీ ఉందన్నారు. మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని మోదీకి క్రెడిట్ ఇచ్చారు. మోదీ పాలనలో ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశంగా ఇండియా మారిందన్నారు. గత 40 కోట్ల మంది భారతీయుల తలసరి ఆదాయం అమెరికా కంటే ఎక్కువని చెప్పారు సుజనా.

కేశినేని నానిపై ఫైర్:
కేశినేని నాని మీద సానుభూతి పడాల్సిందేనని చురకలంటించారు సుజనా చౌదరి. కేశినేని నాని స్థాయికి తాను దిగజారలేనని చెప్పారు. ఇంత త్వరగా కేశినేని నాని దిగజారిపోతారని అనుకోలేదన్నారు సుజనా. కేశినేని నాని లూజ్ కామెంట్స్ చేస్తున్నారని విమర్శించారు. తన ప్రచారం ఎలా ఉంటుందో వేచి చూడాలన్నారు సుజనా.

సుజనా ఇంకా ఏం అన్నారంటే?

• నేను ప్రత్యర్ధులపై కామెంట్ చేయను.

• అధిష్టానం నిర్ణయం ప్రకారం నేను అభ్యర్ధిని.

• తృప్తులు, అసంతృప్తులు సహజంగా వస్తుంటారు.

• ఏపీ కేంద్రం ఇచ్చే ఫలితాలు పొందలేకపోతోంది...

• గో లోకల్.. లోకల్ విత్ ఓకల్ అనే నినాదం ఉంది..

• నేను విజయవాడ దగ్గరలోనే పుట్టాను..

• నేనేమీ మహరాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లో లేను..

• నాకు ప్రత్యక్ష రాజకీయాలలో గతంలో అవకాశం రాలేదు.

• ఈ అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నా.. విజయవాడలో నేను చేయగలిగేది చేస్తాను..

• గాలి వాటుగా వెళ్ళి రాజకీయాలు చేయాలి.. కానీ ఎదురెళ్ళి రాజకీయాలు చేయలేం.

Also Read: ఆ విద్యార్థులకు శాపంగా ఎన్నికల కోడ్.. రేవంత్ సర్కార్ చొరవ తీసుకుంటుందా?

Advertisment
తాజా కథనాలు