తిరువూరులో జనవరి 7 న జరగనున్న చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో కేశినేని నాని, చిన్ని (Kesineni Nani) వర్గీయులు రెచ్చిపోయారు. ఫ్లెక్సీలు చింపేసి, కుర్చీలు విరగ్గొట్టి ఒకరి మీదకు ఒకరు విసురుకుంటూ రణరంగం సృష్టించారు. దీంతో ఈ ఘటన గురించి తాజాగా కేశినేని నాని స్పందించారు. మీడియాతో మాట్లాడారు.
తిరువూరులో జరిగిన ఘటన గురించి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీల కేశినేని చిన్ని అనే వ్యక్తి ఎవరు అసలు..ఎంపీనా, ఎమ్మెల్యేనా అంటూ ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ఊహించే నేను సభలకు రాను..దూరంగా ఉంటాను. చంద్రబాబును నేను పట్టించుకోవడం లేదని నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు.
అయినా సరే మౌనంగా భరించాను. మళ్లీ టీడీపీ అధికారంలోకి రావలన్నా ఉద్దేశంతోనే నేను సైలంట్ గా ఉంటున్నానే తప్ప చేతకాక కాదు అంటూ మండిపడ్డారు. ఎన్ని అవమానాలు ఎదురైనప్పటికీ కూడా ఎంతో ఓపికతో ఎదురు చూస్తున్నాను. కానీ..'' విజయవాడలో ఓ క్యారెక్టర్ లేని వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి మరీ నన్ను చెప్పుతో కొడతా అన్నాడు.పొలిట్ బ్యూరో సభ్యుడు గొట్టంగాడు అన్నాడు. 50 సీట్లకు 30 సీట్లు ఈజీగా వచ్చే మున్సిపల్ కార్పోరేషన్‌ను చెడగొట్టారు. అమ్ముడుపోయి మేయర్ వచ్చేదాన్ని చెడగొట్టారు. ఏడాది కాలం నుంచి తగలబడుతున్న కుంపటి ఇది.
నేను ఎన్ని భరించినా ప్రజలు ఊరుకోరు. విజయవాడ కోసం పని చేసినా నా మీద కచ్చితంగా అభిమానం ప్రజలకు ఉంటుంది. వారికి కోపం వస్తే ఇలానే తిరగబడి వారి ప్రతాపం చూపుతారు. తిరువూరు ఇంఛార్జీ శ్యామ్ దత్ రాజకీయాలకు పనికిరాదు. వాడు పూజకు పనికి రాని పువ్వు. ఈ విషయం గురించే నేను చంద్రబాబుకి తెలిపాను. ఆయన సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు.
తిరువూరు సభను విజయవంతం చేసే బాధ్యత నాది..ఏ సిట్టింగ్ ఎంపీలు సభా ఏర్పాట్లను పరివేక్షణ చేయరు అని అధికారిక ప్రకటన పార్టీ పెద్దలు ఏమి ఇవ్వలేదుగా.. సిట్టింగ్ ఎంపీగా నాకు ఈ పని చేయాలని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు.” అని కేశినేని నాని పేర్కొన్నారు.
Also read: హోటల్ లో మాజీ మోడల్ హత్య..మృతదేహంతో పారిపోయిన నిందితుడు!