Minister Kottu satyanarayana: దుర్గగుడిలో ఏర్పాట్లపై ఏపీ మంత్రి ఆగ్రహం

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. నేడు అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మొదటి రోజు అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. ఈ నేపథ్యంలో భక్తుల క్యూ లైన్లను మంత్రి పరిశీలించారు.

New Update
Minister Kottu satyanarayana: దుర్గగుడిలో ఏర్పాట్లపై ఏపీ మంత్రి ఆగ్రహం

దసరా ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మొదటి రోజు అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో ఇంద్రకీలాద్రికి భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తుండటంతో ఇంద్రకీలాద్రి సందడిగా మారింది. ఈ సందర్భంగా..ఇంద్రకీలాద్రిపై క్యూలైన్స్ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించారు. క్యూ లైన్లతో భక్తులు ఇబ్బంది పడటంతో ఈవో, పోలీసులు, అధికారులపై కొట్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 500ల టికెట్ క్యూలైన్ గంటల తరబడి కదలకపోవడంపై కొట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూలైన్‌లోని భక్తులు మంత్రి కొట్టుకు ఫిర్యాదు చేశారు. ఈవో రామారావును పిలిచి ఏం చేస్తున్నావ్‌..? అంటూ ప్రశ్నించారు. నా చుట్టూ తిరగడం కాదు, ముందు గుడి మీద అవగాహన పెంచుకో అంటూ మంత్రి కొట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత క్యూలైన్‌లోని భక్తులను రూ.500ల టికెట్ క్యూ లైన్‌లో పంపడంపై మంత్రి ఫైర్ అయ్యారు.

ఇది కూడా చదవండి: బీఆర్ఎస్‌లోకి రాజేందర్…యాదవుల్లో కొత్త జోష్

క్యూలైన్లో పంపుతున్న సీఐను సస్పెండ్ చేస్తానంటూ మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. పోలీసులు ఇష్టానుసారం ప్రవర్తిస్తే ఉపేక్షించనని హెచ్చరించారు. భక్తులను క్యూలైన్లో కాక ఇతర మార్గాల ద్వారా ఆలయంలోకి పంపితే ఊరుకునేది లేదని పోలీసులకు వార్నింగ్‌ ఇచ్చారు. క్యూలైన్స్ ఎక్కడా ఆగకుండా చూడాలని కలెక్టర్ ఢిల్లిరావుకు మంత్రి ఆదేశించారు. కొట్టు సత్యనారాయణ ఆగ్రహంతో ఆలయ యంత్రాంగం కదిలింది. ఆగిపోయిన క్యూలైన్స్ కదలించి భక్తులకు ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం అయ్యేలే చేశారు.

మరోవైపు దుర్గగుడిలో దోపిడీ హల్‌చల్‌ చేస్తోంది. కొబ్బరికాయ కొట్టాలంటే 20 రూపాయలు ఇవ్వాల్సిందే అని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఇలా జరుగుతున్న ఆలయ అధికారులు చోద్యం చేస్తూ చూస్తున్నారు. దసరా పండుగని ఆసరాగా చేసుకుని కాంట్రాక్టర్లు డబ్బులు దండుకొంటున్నారు. దీంతో ఆలయ ఆదికారలపై, ప్రభుత్వంపై, కాంట్రాక్టర్లపై భక్తులు మండిపతుడున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: బండారుపై రోజా సీరియస్ యాక్షన్.. కీలక నిర్ణయం తీసుకున్న మంత్రి

Advertisment
తాజా కథనాలు